సాధార‌ణంగా ఉదయం లేవగానే.. కప్పు టీ లేదా కాఫీ తాగనిదే చాలా మందికి రోజు మొదలు కాదు. పని ఒత్తిడిని తగ్గించుకునేందుకు వీటిని ఈ అలవాటు చేసుకుంటారు. ఈ అల‌వాటు ఉన్న‌వారు ఒక్క రోజు తాగ‌క‌పోయినా ఆ డే మొత్తం ఏదో వెలితిగా ఉన్న‌ట్టు అనిపిస్తుంది. అయితే, మనం రోజూ తాగే టీ కంటే..డికాక్షన్‌, లేదా బ్లాక్‌ టీ తాగితే..అది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు వైద్య నిపుణులు. నిజానికి టీ కంటే... డికాక్షన్ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. 

 

మన ఆరోగ్యం మెరుగవ్వడమే కాదు.. గుండె జబ్బులను కూడా టీ-నీరు పోగొడుతుంది. పాలు కలిపిన టీ తాగేవారి కంటే… పాలు కలపకుండా… టీ డికాక్షన్ తాగేవారి బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా డికాక్షన్‌ మన బ్రెయిన్‌కి మంచిచేస్తుందట.  టీ, కాఫీతో పోల్చుకుంటే డికాక్ష‌న్‌లో చాలా తక్కువ మోతాదుతులో కెఫిన్ ఉంటుంది. ఇది తాగితే మ‌న‌కు చాలా ప్రయోజనాలు కలుగుతాయి. డికాక్ష‌న్‌ తాగ‌డం వ‌ల్ల రోజంతా ఉత్సాహంగా ఉండ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది.

 

అదే విధంగా.. యాక్టివ్‌గా ప‌నిచేస్తారు. ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. . డికాక్షన్ తాగేవారి బ్రెయిన్... ముసలితనంలో కూడా చురుగ్గానే ఉన్నట్లు ఓ అధ్యాయ‌నంలో తేలింది. రెగ్యులర్‌గా టీ బ‌దులు డికాక్ష‌న్‌ తాగితే... బ్రెయిన్‌ పనితీరును అది పెంచడమే కాక... రక్షణ కవచంలా ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. మ‌రియు డికాక్ష‌న్ తాగ‌డం వ‌ల్ల‌ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: