అధిక పోష‌క విలువ‌లు క‌లిగి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చే ధాన్యాల్లో బార్లీ గింజ‌లు ఒక రకం. ఈ గింజ‌ల‌తో త‌యారైన బార్లీ నీళ్ల‌తో మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలున్నాయి. ఇవి బరువు తగ్గించడంలో, కొలెస్ట్రాల్‌ను అదుపు చేయడంలో బార్లీ గింజలు అద్భుతంగా తోడ్పడతాయి. బార్లీ నీరు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే బార్లీ గింజ‌ల‌ను ఎక్కువ‌గా బీర్ త‌యారీలో ఉప‌యోగిస్తారు. అంత‌మాత్రం చేత వాటితో త‌యారు చేసిన నీటిని తాగితే మ‌త్తు వ‌స్తుంద‌నుకునేరు. అలా ఏం కాదు. ఆ నీటిని తాగడం వ‌ల్ల ఎన్నో అనారోగ్యాల‌ను దూరం చేసుకోవ‌చ్చు.

 

బార్లీ వాటర్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల ముఖ్యంగా బీటా గ్లూకాన్ అధికంగా ఉండటం వల్ల త్వరగా ఆకలి అనిపించదు మరియు మీకు ఇతర ఆహారాల మీద మనస్సు పోదు కాబట్టి, బరువును క్రమంగా తగ్గించుకోవచ్చు. మ‌ధుమేహం ఉన్న వారు బార్లీ నీటిని తాగ‌డం ఎంతో మంచిది. ఎందుకంటే బార్లీలో ఉండే బీటా గ్లూకాగాన్ గ్లూకోజ్ గ్ర‌హించ‌డాన్ని ఆల‌స్యం చేస్తుంది. దీంతో ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెర‌గ‌వు. అలాగే బార్లీలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. 

 

ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గాలనుకునేవారికి బార్లీ నీరు ఎంతగానో ఉపయోగపడుతాయి. కిడ్నీలో రాళ్ల‌ను క‌రిగించే శ‌క్తి బార్లీ నీటికి ఉంది. రోజూ బార్లీ నీటిని తాగుతుంటే కిడ్నీల్లో ఉన్న రాళ్లు క‌రిగిపోతాయి. బార్లీ వాటర్ లో ఉండే బీటా గ్లూకాన్ ను వ్యాధినిరోధక శక్తి పెంచి ఎనర్జీని అందిస్తుంది. అదే విధంగా,  క‌డుపులో మంట‌, అసిడిటీ, గ్యాస్‌, అజీర్ణం, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: