బేకింగ్ సోడా.. దీన్నే వంట సోడా అని కూడా అంటారు. దీన్ని చాలా మంది వంట‌ల్లో వేస్తారు. ప్ర‌ధానంగా బేక‌రీల్లో త‌యారు చేసే ప్ర‌తి ప‌దార్థంలోనూ ఇది ఉంటుంది. అయితే బేకింగ్ సోడా బేక్ చేయడానికి విరివిగా ఉపయోగిస్తామన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. కానీ.. బేకింగ్ సోడా అంతకంటే ఎక్కువ ప్రయోజనాలనే అందిస్తుంది. వంట‌ల‌లో మాత్ర‌మే కాదు నిత్యం ఒక టీస్పూన్ మోతాదులో బేకింగ్ సోడాను తాగ‌డం వ‌ల్ల అద్భుత‌మైన ఫ‌లితాలు క‌లుగుతాయి. చిటికెడు బేకింగ్ సోడాను నీటిలో మిక్స్ చేసి త్రాగడం వల్ల అజీర్తి, ఇన్ఫెక్షన్స్ మరియు హార్ట్ బర్న్ వంటివి తగ్గించుకోవచ్చు. 

 

అంతే కాదు మరెన్నో అనారోగ్య సమస్యలను నివారించుకోవచ్చు. కిడ్నీలో రాళ్ల‌ను క‌రిగించే శ‌క్తి బేకింగ్ సోడాకు ఉంది. ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా బేకింగ్ సోడానే వేసి బాగా క‌లిపి ఆ నీటిని రోజూ తాగుతున్న‌ట్ట‌యితే కిడ్నీల్లో రాళ్లు క‌రిగిపోతాయి. అలాగే గ్యాస్‌ సమస్య వచ్చినప్పుడు ఒక నిమ్మకాయ రసంలో సగం టేబుల్‌స్పూన్‌ బేకింగ్‌ సోడా వేసి, దానిలో కప్పు నీటిని కలిపి, తాగితే చాలా మంచిది. దీన్ని రోజూ ఉదయాన్నే తాగితే మరీ మంచిది. 

 

ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని బాగా పుక్కిలిస్తే గొంతు నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. గొంతులో మంట కూడా త‌గ్గుతుంది. వర్కౌట్స్, రన్నింగ్, జాగింగ్ చేసినప్పుడు శరీంరలో లాక్టిక్ యాసిడ్ పెరుగుతుంది . బేకింగ్ సోడా వాటర్ తీసుకొన్నప్పుడు అలసట నుండి ఉపశమనం కలుగుతుంది. బేకింగ్ సోడా వాటర్ త్రాగడం వల్ల ఫ్రెష్ బ్రీత్ ఉంటుంది మరియు దంతాల తెల్లగా మెరుస్తాయి . అంతే కాదు, నోట్లో కొన్ని మైక్రోబ్యాక్టీరియాను నాశనం చేస్తుంది . ఓరల్ హెల్త్ మంచిగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: