మారుతున్న జీవన శైలి కారణంగా మన జీవితాల్లోకి ప్రాసెస్డ్ ఫుడ్ ఓ భాగమై పోయింది. కానీ.. ప్రాసెస్‌డ్‌ ఆహారం ఏదీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అంతేకాదు, అది గుండె ఆరోగ్యాన్ని మరింతగా దెబ్బతీస్తుందట. ఈ విషయాన్ని అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ చెబుతోంది. ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకునేవాళ్లలో బరువు పెరగడంతోబాటు క్రమేణా గుండె పనితీరు కూడా దెబ్బతిన్నట్లు వారు గుర్తించారు.

 

ఈ పరిశోధన కోసం కొంతమంది పెద్దవాళ్లనీ, మరికొందరు చిన్న వయస్కులనీ ఎంపిక చేసి మరీ పరిశీలించారట. వాళ్లలో, వయసుతో నిమిత్తం లేకుండా- ప్రాసెస్‌డ్‌ ఆహారపదార్థాలకన్నా ముడివాటిని తినే పెద్దవాళ్లలోనే వాటిని తినని పిల్లల కన్నా గుండె ఆరోగ్యం బాగున్నట్లు గుర్తించారు.

 

కొవ్వులు, పిండిపదార్థాలు, పంచదార, కృత్రిమ ఫ్లేవర్లు, రంగులు ఉపయోగించి తయారుచేసిన సాఫ్ట్‌ డ్రింకులూ ఏమాత్రం గుండెకు మంచిది కాదు. ఉప్పుతో కూడిన స్నాక్సూ కుకీలూ కేకులూ ప్రాసెస్‌డ్‌ మాంసమూ చికెన్‌ నగ్గెట్సూ ఇన్‌స్టంట్‌ సూపులూ... వంటివన్నీ అల్ట్రా ప్రాసెస్‌డ్‌ ఫుడ్స్‌ జాబితాలోకే వస్తాయి. ఇవి కూడా గుండెకు ప్రమాదకరం.

 

అందుకే.. పండ్లూ కూరగాయలూ నట్సూ ముడిధాన్యాలూ ఆకుకూరలూ... వంటి వాటిని తినడం వల్ల గుండెతోబాటు మొత్తంగా ఆరోగ్యం మెరుగవుతుందని వారు చెబుతున్నారు. అందుకే మీ గుండె జాగ్రత్త.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: