కొత్తగ ఓ  టైఫాయిడ్ వ్యాక్సిన్ ని కనిపెట్టారు వైద్యులు ఏది  'చాలా అద్భుతంగా' పనిచేస్తోందని.. ఈ ఇన్‌ఫెక్షన్‌లో దాదాపు చికిత్స చేయలేని రకాన్ని నిలువరించటానికి దీనిని ఉపయోగపడుతుందని  వైద్యులు చెప్తున్నారు.ఈ వ్యాక్సిన్ గొప్ప మార్పు తీసుకొస్తుందని.. టైఫాయిడ్ మరణాలను గణనీయంగా తగ్గిస్తుందని నిపుణులు చెప్పారు.

 

యాంటీబయోటిక్స్‌ను బలంగా తట్టుకుని మరీ టైఫాయిడ్ విస్తరిస్తున్న పాకిస్తాన్‌లో 90 లక్షల మంది పిల్లలకు ఈ వ్యాక్సిన్ ఇస్తున్నారు.కలుషిత ఆహారం, నీటి ద్వారా వ్యాపించే సాల్మొనెలా టైఫీ అనే బ్యాక్టీరియా సోకటం వల్ల టైఫాయిడ్ జ్వరం వస్తుంది.ఇది పేదరిక వ్యాధి. పారిశుధ్యం అతి తక్కువగా ఉండే, శుభ్రమైన తాగునీటి కొరత ఉండే దేశాల్లో అది చాలా ఎక్కువగా ఉంటుంది.

 

లక్షణాలు:

ఎక్కువ కాలం కొనసాగే జ్వరం
తలనొప్పి
వాంతులు
ఆకలి మందగించటం
మలబద్ధకం
టైఫాయిడ్ సోకిన వారిలో సగటున ప్రతి 100 మందిలో ఒకరికి అంతర్గత రక్తస్రావానికి దారితీసి ప్రాణాంతకంగా పరిణమిస్తుంది.

 

టైఫాయిడ్‌కు సంబంధించి ఖచ్చితమైన గణాంకాలు సేకరించటం కష్టం. అయితే.. ప్రతి ఏటాప్రపంచ వ్యాప్తంగా 1.1 కోట్ల నుంచి 2.1 కోట్ల మందికి ఇది సోకుతోంది. ఏటా 1,28,000 మంది నుంచి 1,61,000 మందిని బలితీసుకుంటోంది.టైఫాయిడ్.. యాంటీబయోటిక్స్‌ను తట్టుకోవటంలో పతాక స్థాయి సామర్థ్యాన్ని సంతరించుకుందని.. ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న చికిత్సల పరిమితిని మించిపోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

 

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వేగంగా పట్టణీకరణ జరుగుతున్న నేపథ్యంలో.. ఈ వ్యాధిని నివారించటానికి అత్యంత సమర్థవంతమైన మార్గం శుభ్రమైన తాగునీరు, నీటితో ఫ్లష్ చేసే టాయిలెట్లను అందరికీ అందుబాటులోకి తేవటం చాలా దేశాలకు అసాధ్యంగా మారుతోంది.ఇప్పటికే రెండు టైఫాయిడ్ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాకూడా.. రెండు సంవత్సరాల వయసు లోపు పిల్లలకు ఇవ్వటానికి రెండిటిలో దేనికీ అనుమతి లేదు. కాబట్టి అత్యంత ముప్పు ఉన్న పిల్లలకు వ్యాక్సిన్ రక్షణ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: