సాధార‌ణంగా శ‌న‌గ‌లు తెలియ‌ని వారుండ‌రు. శ‌న‌గ‌లు, శ‌న‌గ‌ప‌ప్పు, శ‌న‌గ‌పిండి.. ఇలా మ‌న నిత్య జీవితంలో ఏదో విధంగా వీటిని ఉప‌యోగిస్తూనే ఉంటాము. శనగలు.. సంప్రదాయానికి, పూజలకు పెట్టింది పేరు. ఏ ఆలయంలోనైనా.. ఏ ఇంట్లోనైనా ప్రత్యేక పూజలు చేశారంటే శనగలు ప్రసాదంగా, నైవేద్యంగా సమర్పిస్తారు. శనగల్లో ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి దీర్షకాలికంగా.. ఎంతో ప్రయోజనాలు చేకూరుస్తాయి. శ‌న‌గ‌ల‌ను పొట్టు తీయ‌కుండా డైరెక్ట్‌గా అలాగే ఉడ‌క‌బెట్టో, నాన‌బెట్టో, మొల‌క‌ల రూపంలోనో తింటే మ‌న‌కు ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్రయోజ‌నాలు క‌లుగుతాయి.

 

శనగల్లో రోగనిరోధక శక్తిని పెంచే గుణం ఉంది. ఇందులో ఉండే మాంగనీస్, మెగ్నీషియం శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని అందించడానికి సహాయపడతాయి. కొన్ని అధ్యయనాల్లో తేలిన విషయమేంటంటే.. శనగలు తీసుకోనివారికంటే.. శనగలు తీసుకున్నవారు త్వరగా బరువు తగ్గుతారని తేలింది. శనగల్లోని ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని తగ్గిస్తాయి. దీంతో గుండె సంబంధిత సమస్యలు దూరమవుతాయి. శనగల్లో ఐరన్, ప్రొటీన్, మినరల్స్ ఉంటాయి. ఇవి మీ శరీరానికి ఎనర్జీని అందిస్తాయి. దేశీయ వంటకాలలో ముఖ్యంగా శాకాహార వంటల్లో శనగలు చాలా ఇష్టపడి, ఆదరించబడే పదార్థం. 

 

పోషణపరంగా, శనగలు ఆరోగ్యానికి కావాలసిన రెండు ముఖ్యమైన పోషకాలైన ప్రొటీన్లు, పీచుపదార్థంతో నిండి ఉంటాయి. అలాగే శనగల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్.. మిమ్మల్ని స్ట్రాంగ్ గా మార్చి.. ఎల్లప్పుడు ఎనర్జిటిక్ గా ఉండటానికి సహాయపడతాయి.పొటాషియం, మెగ్నిషియం, కాల్షియం వంటి ఎన్నో ర‌కాల మిన‌ర‌ల్స్ శ‌న‌గల్లో ఉంటాయి. ఇవి బీపీని కంట్రోల్ చేస్తాయి. ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌కుండా చేస్తాయి. శ‌న‌గ‌ల‌ను త‌ర‌చూ తింటుంటే ర‌క్తంలో ఎర్ర ర‌క్త క‌ణాల సంఖ్య పెరుగుతుంది. దీంతో ర‌క్తం బాగా ప‌డుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: