చలికాలంలో వీచే చల్లని గాలి ప్రభావం, వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గడం, పొగమంచు వాతావరణం లాంటి వాటి వల్ల, ఆ వాతావరణానికి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అనేక అనారోగ్యాలకు గురవ్వాల్సివస్తుంది. వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌, జలుబు, శ్వాసకోశానికి సంబంధించిన వ్యాధులు, దగ్గు తలనొప్పిలాంటివి ప్రధానంగా ఏర్పడే అనారోగ్యాలు. ముఖ్యంగా చలికాలంలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందంటున్నారు డాక్టర్లు. చాలా అధ్యయనాలు కూడా  ఇదే విషయాన్ని చెబుతున్నాయి.


చలికాలంలో ఆహారం వేడిగా తినడం చాలా అవసరం. అలా చేస్తే శక్తిని పునరుద్ధరించినట్లే! ముఖ్యంగా సూప్‌లు వంటివి శరీరానికి సత్తువనిస్తాయి. చలికాలంలో పీచు పదార్థాలు, పళ్లు, ఆకుకూరలు, కాయగూరలు బాగా తినాలి. ప్రోటీన్లు గల గింజధాన్యాలు, మాంసం తీసుకోవాలి. సీజనల్‌ పళ్లు తీసుకోవాలి. ముఖ్యంగా మీ ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే ఈ సూత్రాలను పాటించండి.


పాదాల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ కలిపి ఆ మిశ్రమాన్ని పాదాలకు రాసి కొద్దిసేపటి తర్వాత చన్నీటితో కడిగి మాయిశ్చరైజర్‌ రాయాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే పాదాల మీది మృతకణాలు పోయి మృదువుగా మారతాయి.

 

గుండె సంబంధ వ్యాదిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
గుండె సంబంధ వ్యాధులున్నవారు రోజూ వ్యాయామం గుండెకు మంచిది, కాని చల్లగా ఉన్న రోజుల్లో  మార్నింగ్ కాకుండా ఈవినింగ్ వాకింగ్,జాగింగ్ చేయాలి. ఎందుకంటే రక్తపోటు సహజంగా మార్నింగ్ పెరుగుతుంది కాబట్టి.

 

జలుబు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు
మన ఇంటిలోనో లేదా ఆఫీసు లోనో తరచూ జలుబు తోనో దగ్గు తోనో  బాధ పడుతుండటం చూస్తుంటాం. సాధారణ జలుబు సాధారణమే అయినా దీనిని నిర్లక్ష్యం చేస్తే  అది తలనొప్పికి, గొంతు నొప్పికి, ముక్కు దిబ్బడకు మరియు శ్లేష్మం పేరుకోవడానికి దారి తీస్తుంది. జలుబు ను తద్వారా వచ్చే ఇతర వ్యాధులు నివారించేందుకు ఎక్కువ లేయర్ల దుస్తులు ధరించడం , వేడి నీటిని పుక్కిలించడం, నీటి ఆవిరి పట్టడం ద్వారా దగ్గు జలుబు నివారించవచ్చు.


పొడి చర్మం ఉన్నవారు తీసుకోవలసిన జాగ్రత్తలు
హ్యూమిడిటి తక్కువ వుండటం వల్ల పొడి చర్మం చలి కాలంలో సాధారణం అయినా , మరీ వేడి నీటి స్నానం చేయకూడదు. పెట్రోలియం జెల్లీ, క్రీము లు రాసుకోవడం ద్వారా  చర్మాన్ని రక్షించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: