చలికాలం వచ్చిందంటే చాలు.. అనారోగ్య సమస్యలు బాగా ఎక్కువగా వస్తాయి. ముఖ్యంగా జలుబు, ముక్కు దిబ్బడ తదితర శ్వాసకోశ సంబంధిత సమస్యలు బాగా వస్తాయి. చలికాలంలో రోగ నిరోధక శక్తి త్వరగా తగ్గిపోతుంది. ఇలా తగ్గడం వల్ల హానికారక వైరస్‌లు సులభంగా శరీరంలోకి వస్తాయి. ఇలా జరగకుండా ఉండాలంటే..తగిన జాగ్రత్తలు,  చిట్కాలు పాటించడం చాల మంచిది. ఇక అవి ఏంటో తెలుసుకుందామా మరి... 

 

 

ముఖ్యంగా  చలికాలంలో చల్లని గాలులు, పొగ మంచులోకి అస్సలు వెళ్లకుండా జాగ్రత్త పాడడం చాలా మంచిది. ఒక వేళా తప్పకుండా వెళ్లాల్సి వస్తే తప్పకుండా ఉన్ని వస్త్రాలను ధరించి వెళ్లడం చాల మంచిది. ఇక  తీవ్రమైన చలిలో శరీరంపై వస్త్రాలు లేకుండా తిరగడం చాలా ప్రమాదం ఆర్యోగనికి. ఇక చలిగాలి తీవ్రత ఎక్కువగా ముఖం, చేతులు, పెదవులు, పాదాల మీద ప్రభావం చాల ఎక్కువగా ఉంటుంది. 

 

 

ఇక  చలికాలంలో జిడ్డు చర్మం కలిగినవారికి పెద్దగా సమస్యలు రావు అంటే నమ్మండి. పొడి చర్మం గలవారికే ఎక్కువ సమస్యలు వస్తాయి. చర్మం పొడిబారకుండా, పగుళ్లు రాకుండా ఇలా చేయండి.. ఉదయం గోరవెచ్చని నీటిలో కొద్దిగా కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె చుక్కలు వేసి స్నానం చేయడం చాల మంచిది. ఇక  ముఖం అందంగా మెరవాలంటే.. విటమిన్-ఇ ఉండే మాయిశ్చరైజర్లు వాడడం చాల మంచిది. రాత్రి నిద్రపోయే ముందు కాళ్లు, చేతులకు వేజలైన్ లేదా కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల చర్మాన్ని కాపాడుకోవచ్చు. 

 

 

కొందరికి చలికాలంలో మూత్రం ఎక్కువగా వస్తుందనే కారణంతో చాలా మంది నీటిని తాగడం మానేస్తారు. ఇలా నీళ్లు తక్కువ తాగడం  మంచి అలవాటు కాదు.  ఇక  చలికాలంలో ఆహారాన్ని చల్లబడకుండా చుడండి. వేడిగా ఉన్నప్పుడే తినడం చాల మంచిది. ఏదైనా ఆహారాన్ని తినే ముందు చేతులను శుభ్రం చేసుకొని తినడం మంచిది. చలికాలంలో వెల్లులి తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి క్షీణిస్తుంది. అలాగే సిట్రస్ జాతికి చెందిన పండ్లు తినడం చాలా మంచిది ఆర్యోగనికి. ఇంకెందుకు ఆలస్యం ఈ చిట్కాలను పాటించి మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: