ఎరుపు రంగులో, హృదయాకారంలో ఉండే స్ట్రాబెర్రీ పోషకాల నిధి. అందుకే వీటిని ఫ్రూట్‌ సలాడ్స్‌లో, ఐస్‌క్రీమ్‌ల తయారీలో విరివిగా వాడతారు. చూసేందుకు అందంగా, తినేందుకు రుచిగా ఉండే స్ట్రాబెర్రీలు ఆరోగ్యానికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. మన శరీరానికి ఉపయోగపడే అద్భుతమైన ఔషధగుణాలు ఈ పండులో ఉంటాయి. వీటిల్లో ఉండే విటమిన్ సి, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. జీర్ణ సమస్యలను పోగొడతాయి. బరువు తగ్గాలనుకునే వారికి స్ట్రాబెర్రీ మంచి ఛాయుస్‌. ఎందుకుంటే దీనిలో కొవ్వును కరిగించే లెప్టిన్‌, అడిపోనెక్టిన్‌ వంటి హార్మోన్లు ఉంటాయి. 

 

ఇవి ఆకలిని తగ్గించి, రక్తంలో చక్కెర శాతం పెరగకుండా చూసి, బరువు తగ్గడంలో తోడ్పడతాయి. స్ట్రాబెర్రీల్లోని ఫ్లేవనాయిడ్‌లు, మాంగనీస్‌, విటమిన్‌ సి సమృద్ధిగా లభించడం వల్ల గుండె పనితీరును మెరుగుపర్చడంతో పాటు క్యాన్సర్‌ను నిరోధిస్తుంది. స్ట్రాబెర్రీలను మిల్క్‌ షేక్స్‌, సలాడ్స్‌లలో వేసుకుని తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని న్యూట్రీషియన్లు చెబుతున్నారు. ఈ పండ్లలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారించి, గుండె పోటు ప్రమాదం నుంచి కాపాడతాయి.

 

గర్భిణులు ఈ పండు తింటే వారికి అవసరమైన ఫోలిక్‌ ఆమ్లం లభిస్తుంది. ఇది పుట్టబోయే బిడ్డలో లోపాలు ఏర్పడకుండా చూస్తుంది.స్ట్రాబెర్రీలో ఉండే యాంటీఆక్సిడెంట్ గుణాలు కంటి శుక్లాలు నివారించడంలో, అంధత్వాన్ని దూరం చేయడంలో, కంటి మీద మసక వంటి సమస్యల రాకుండా ఎదుర్కోగల శక్తి ఇందులో పుష్కలం. స్ట్రాబెరీలో ఎలాజిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది మంచి యాంటీఆక్సిడెంట్. ఇది ఎముకల బలానికి బాగా సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: