ప్రతి రోజూ మనం ఉదయం అల్పాహారం తీసుకొనే అలవాటు ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ప్రతి రోజూ మనం తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ ఆరోజుకు ఎంత ముఖ్యమో మనందరికీ తెలిసిన విషయమే. వాస్త‌వానికి ఉదయం లేవగానే... వేడి వేడి కాఫీ.. కాసేపటికి హాట్ టిఫిన్ కడుపులో పడితే ఆ సుఖమే వేరు. ఇక ఆ రోజంతా కూడా ఫ్రెష్‌గా ఉంటుంది. ఇక రోజంతా ఎలా ఉంటున్నామో.. దాని పైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అయితే ఈ మధ్య ఈ ఉరుకుల పరుగుల జీవితంలో బ్రేక్ ఫాస్ట్ చేయడమే గగనమవుతోంది. కొంత మంది బద్దకంతో మరికొంత మంది ఏకంగా లంచ్ త్వరగా చేసేద్దామనే సాకుతో టిఫినీలను ఎగ్గొట్టేస్తున్నారు.

 

అయితే ఆఫీస్‌ సమయాలలో హ్యాపీగా, ఎనర్జిటిక్‌గా పనిచేయాలని మనసులో అనుకుంటే సరిపోదు. అందుకోసం మంచి నిద్ర, ప్రతిరోజూ కొద్దిసేపు వ్యాయామంతోపాటు కొన్ని ఆహార నియమాలు పాటిస్తే సరి. ముఖ్యంగా ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే స‌రిపోతుంది. ఉదయాన్నే సరైన బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం వల్లా శరీరం, మెదడు ఉత్తేజంగా మారుతుంది. ఉదయం రెండు, మూడు జీడిపప్పులు లేదా బాదం పప్పు తినాలి. అలాగే కూరగాయ ముక్కలు, ఆకుకూరలు, కొద్దిగా జొన్న, రాగి లేదా సజ్జ వీటిల్లో ఏదైనా ఒక దాని పిండితో తయారు చేసిన పుల్కాలను తినాలి. 

 

దీంతో శరీరానికి శక్తి అందుతుంది. ఉదయమే శరీరానికి పోషణ బాగా లభిస్తుంది. మనం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌లో ఖచ్చితంగా ప్రోటీన్స్ ఉండాలి. దీనివల్ల ఎముకలు, కండరాలు బలంగా మారతాయి. అలాగే పండ్లు ఏవైనా రోజంతా శక్తినిస్తాయి. ఫ్రూట్స్‌లో ఉండే ఫైబర్‌, కాంప్లెక్స్‌ షుగర్స్‌ సులభంగా జీర్ణమవుతాయి. కాబట్టి ఉదయమే పాలు, కోడిగుడ్డు వంటి వాటికంటే ఏదైనా పండు తినడం ఆరోగ్యానికి మంచిది. సో.. ఉదయాన్నే ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుందీ.. దీని కారణంగా అధికబరువుకి కూడా చెక్ పెట్టొచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: