చేపలు, చికెన్, మటన్, రొయ్యలు.. ఇలా మనకు తినేందుకు అనేక రకాల మాంసాహారాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో అనేక మంది చికెన్, మటన్‌లను ఎక్కువగా తింటుంటారు. ఇక కొందరు కేవలం సీఫుడ్‌కే అధిక ప్రాధాన్యతను ఇస్తుంటారు. అయితే చికెన్ పేరు వినగానే ఇంట్లో.. ఒంట్లో ఒక వైబ్రేషన్ మొదలవుతుంది. ముందు రోజు ఉపవాసమున్నా.. రాత్రి పన్నెండు కొట్టగానే కో..కో.. అంటూ లెగ్ పీసులను లాగించేస్తుంటారు కొందరు. మ‌రియు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అతి ఇష్టంగా తినే ప్రముఖ మాంసాహారాల్లో కోడి మాంసానికి మొదటిస్థానం లభిస్తుందంటే అతిశయోక్తి కాదు. 

 

అయితే ఏ మాంసాహారం అయినా సరే మితింగా తింటే ఎలాంటి ప్ర‌మాదం ఉండ‌దు. ఇదిలా ఉంటే.. మెదడులో రక్తనాళాలు చిట్లి చనిపోవడం మాంసాహారుల్లో ఎక్కువగా జరుగుతుందని, శాకాహారుల్లో తక్కువగా ఉంటుందని ప్రజలు గత కొంత కాలంగా నమ్ముతూ వస్తున్నారు. కానీ.. మాంసాహారులకన్నా శాకాహారుల్లో బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే అవకాశం 20 శాతం అధికమని పరిశోధకులు తెలిపారు. శాకాహారుల్లో మెదడు రక్తనాళాల గుండా తక్కువ కొలస్ట్రాల్, బీ12 లాంటి విటమిన్లు తక్కువగా ప్రవహించడం వల్ల రక్తనాళాలు చీలిపోయే అవకాశం ఎక్కువగా ఉందని ప‌రిశోధ‌కులు తెలిపారు.

 

అలాగే మ‌రో విష‌యం ఏంటంటే.. మాంసం తినేవారికన్నా శాకాహారులు, చేపలు తినే వారిలో గుండెపోటు వచ్చే అవకాశం తక్కువ ఉంటుందని వారు తెలిపారు. మాంసహారులతో పోలిస్తే శాకాహారుల్లో గుండెపోటు వచ్చే అవకాశం 22 శాతం తక్కువని చెప్పారు. అయితే   నిత్యం ఏ మాంసాహారం అయినా సరే.. అందులో కొవ్వు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. మన శరీరానికి నిత్యం కావల్సిన కొవ్వు పదార్థాల మోతాదు మించకుండా మాంసాహారాలను తినాలి. ఇలా తింటే రోజూ మాంసాహారం తిన్నా ఎలాంటి దుష్పరిణామాలు కలగవు. ఇక చికెన్, చేపలను రోజూ తినవచ్చు. కాకపోతే మితంగా తీసుకుంటేనే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: