ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఫిట్నెస్ కోసం చాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మహిళలు చాల ప్రయత్నాలు, జాగ్రతలు బాగా తీసుకుంటారు. మరి ఇప్పుడు  ఏరోబిక్స్ వ్యాయామాలు చేసే మహిళలు పాటించాల్సిన జాగ్రత్తలను తెలుసుకుందామా మరి..

 

మహిళలు ఆర్థ్రయిటిస్‌ ఉంటే ఏరోబిక్స్ చేయొచ్చా.. మహిళలు ఆర్థ్రయిటిస్‌ ఉన్నా వ్యాయామాలు చేయవచ్చు. అయితే బరువులు ఎత్తే వ్యాయామాలు చేయకూడదు. బాడీ బిల్డింగ్‌ కూడా చేయకూడదు. నేల మీద కూర్చుని చేసే వ్యాయామాలు కూడా చేయకూడదు. ట్రెడ్‌మిల్‌ మీద నడిచేటప్పుడు అనుకూలంగా ఉండే వేగంలోనే నడవాలి. ట్రెడ్‌మిల్‌ గ్రేడ్‌ వాడకూడదు. స్టాటిక్‌ సైక్లింగ్‌ చేసేటప్పుడు కూడా కీళ్ల మీద ఒత్తిడి పడకుండా చూసుకోవాలి ముఖ్యంగా.

 

ఆస్టియోపోరోసిస్‌ను ఉన్న మహిళల కోసమే ఈ వ్యాయామం అని నిపుణులు తెలియ చేస్తున్నారు...ప్రతి మహిళా తప్పించుకోలేని ఆరోగ్య సమస్య ‘ఆస్టియోపోరోసిస్‌’. 35 ఏళ్ల వయసులో మొదలై క్రమంగా పెరుగుతూ, మెనోపాజ్‌ దశకు చేరుకున్న తర్వాత తీవ్రత పెరిగే ఈ సమస్యను ముందుగానే అరికట్టే వీలుంది. ఎముకలు గుల్లబారే ఈ సమస్యను అరికట్టాలంటే 35 ఏళ్లు దాటిన ప్రతి మహిళా అరగంటపాటు, వారంలో కనీసం మూడు రోజులపాటు వ్యాయామాలు చేయాలి. పాల ఉత్పత్తులు దైనందిన ఆహారంలో భాగం చేసుకోవాలి. ప్రతి రోజూ కనీసం పావు లీటరు పాలు తప్పనిసరిగా తాగాలి.


 
మహిళలకు ఎలాంటి క్యాల్షియం అవసరం అనే విషయానికి వస్తే..35 ఏళ్లు దాటిన తర్వాత మహిళల ఎముకల సాంద్రత తగ్గుతూ ఉంటుందని, ఎముకలు గుల్లబారతాయనే అవగాహన విస్తృంతంగా ఉంది. ఇది నిజమే! ఇందుకోసం 35 ఏళ్ల వరకూ ప్రతిరోజూ పావు లీటరు పాలు, పాల ఉత్పత్తులు తీసుకుంటూ, క్రమం తప్పక వ్యాయామం చేస్తే మెనోపాజ్‌ వరకూ ఎముకల అరుగుదలను నియంత్రించవచ్చు. ఆ తర్వాత తప్పనిసరిగా క్యాల్షియం సప్లిమెంట్లు వాడాల్సిందే కచ్చితంగా. సాధారణంగా ప్రకటనల్లో కనిపించే క్యాల్షియం సప్లిమెంట్లన్నీ క్యాల్షియం కార్బొనేట్‌వే! . క్యాల్షియం సిట్రేట్‌ కేవలం వైద్యులు మాత్రమే సూచిస్తారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: