సాధార‌ణంగా అన్ని పోషకాలు తగిన మోతాదులో ఉండే ఆహారం మొలకెత్తిన విత్తనాలు. విటమిన్లు, ఖనిజలవణాలు, ప్రోటీన్లు వీటిలో పుష్కలంగా ఉంటాయి. అయితే మన ఆరోగ్య సమస్యలకు పోషకాహార లోపం ప్రధాన కారణమనేది నిపుణుల మాట. కానీ.. సోయా పోషకాహార లోపంతో బాధపడుతున్న వారికి గొప్ప వరం వంటిద‌ని నిపుణులు అంటున్నారు. వాస్త‌వానికి వంద గ్రాముల సోయాబీన్స్‌లో ఫైబర్ 9.3 గ్రాములు, ప్రోటీన్లు 36.49, జింక్ 4.89, విటమిన్ సి 60 మిల్లీ గ్రాములు, ఐరన్ 15.7 గ్రాములు ఉంటాయి. 

 

అలాగే సోయా ప్రోటీన్లలో తక్కువ కొవ్వు ఉండడం వల్ల రక్త నాళాలలో కొవ్వు చేరటం వంటి గుండె జబ్బుల బెడద లేదు. హృదయానికి మేలు చేసే ఆహారాల్లో ఇదీ ఒకటని పలు అంతర్జాతీయ సంస్థలు ప్రకటించాయి. మ‌రియు  వీటిలో ఉండే అధిక ఫైబర్ బ్లడ్ షుగర్ తగ్గేందుకు ఉపయోగపడుతుంది. రుతుక్రమం సమయంలో మహిళల్లో ఈస్ట్రోజన్ ఉత్పత్తి తగ్గి మహిళలు నిద్రలేమి, మానసిక ఆందోళన, చీకాకు వంటి సమస్యల బారిన పడతారు. కానీ.. సోయా ఉత్పత్తులతో ఈ సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు. అదే విధంగా, పెద్దపేగు ఆరోగ్యానికి సోయా ఉత్పత్తులు దోహదం చేస్తాయి. 

 

ముఖ్యంగా పెద్దపేగు క్యాన్సర్‌ ముప్పును గణనీయంగా తగ్గిస్తాయి. జీర్ణవ్యవస్థ పనితీరును పెంచేందుకు, అన్నవాహిక ఆరోగ్యానికి ఈ ఉత్పత్తులు ఎంతో దోహదం చేస్తాయి. మ‌రియు సోయాబీన్స్ వ‌ల్ల క్యాన్సర్ కారకాలను తొలగించడానికి ఉపయోగపడతాయి. హైపర్ టెన్షన్ తో బాధపడేటప్పుడు సోయాబీన్స్ ను తీసుకోవడం వల్ల ఇందులో ఉండే మెగ్నీషియం మరియు పొటాషియం గ్రేట్ గా సహాయపడుతుంది. సో.. రోజూ 25 గ్రాముల సోయాబీన్స్ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: