సాధారణంగా నువ్వులు రెండు రకాలు, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు. పురాతన కాలం నుంచి మన సాంప్రదాయ వంటల్లో నువ్వులు, దాని నూనెను విరివిగా ఉపయోగిస్తున్నారు. దీనితో చేసిన వంటలు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. గొప్ప పోషక విలువలున్న కారణంగా వీటిని 'పవర్ హౌసెస్' అంటారు. మెగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన పిండిపదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజ లవణాలు, కాల్షియం, జింక్, ఐరన్, థయామిన్ మరియు విటమిన్ 'E'ల సమాహారమైన ఈ నూనె అటు ఆరోగ్యానికి ఇటు సౌంద‌ర్యానికి చాలా మంచిది.

 

నువ్వుల నూనె టైప్ 2 డయాబెటిస్‌ను తగ్గించడంలో బాగా పనిచేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. దీంట్లో ఉండే విట‌మిన్ ఇ, బిలు చర్మాన్ని సంరక్షిస్తాయి. చర్మానికి కొత్త మెరుపులను ఇచ్చేందుకు, యవ్వనంగా కనిపించేందుకు నువ్వుల నూనె దోహదం చేస్తుంది. శరీరంలో సోడియంను తగ్గించి బ్లడ్ లెవల్స్ కంట్రోల్లో ఉంచుతుంది. నువ్వుల నూనె క్యాల్షియంను అధికంగా అంధించడం వల్ల కీళ్ళ ను కాపాడి, తలనొప్పి రాకుండా చేస్తుంది. నువ్వుల నూనె లోని పోషకాలు జుట్టు రాలటాన్ని నిరోధించటమే గాక కేశాల ఎదుగుదలకు దోహదపడతాయి. 

 

అదే విధంగా, నువ్వుల నూనె ఒత్తిడి తగ్గించి, టెంషన్ నుండి బయటపడేలా చేస్తుంది. నరాల బలహీనతను తొలగిస్తుంది. ఒంటికి నువ్వుల నూనెతో మర్ధన చేసుకుంటే ఎర్ర మచ్చలు తగ్గి చర్మం మృదువుగా, కోమలంగా మారుతుంది. అలాగే జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు సింపుల్ గా నువ్వుల నూనె వాసన చూస్తే చాలు జలుబును తగ్గించి, శ్వాసతీసుకోవడానికి సులభం చేస్తుంది. ఇక రాత్రి పడుకునే ముందు కొద్దిగా నువ్వుల నూనె రాసుకుంటే చర్మం మీది మలినాలు తొలగి ముఖం తాజాగా మారుతుంది. 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: