సాధారణంగా వృద్ధాప్యంలో కీళ్ల నొప్పులు ఎవరికైనా వస్తాయి. కానీ మారుతున్న జీవన శైలి కారణంగా యుక్త వయస్సులో ఉన్నవారు కూడా కీళ్ల నొప్పులతో ఇబ్బందులు పడుతున్నారు.  కీళ్ల నొప్పులతో బాధ పడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉండటం గమనార్హం. కానీ కొన్ని ఆహార పదార్థాలను రోజూ తింటే కీళ్ల నొప్పుల సమస్యలు దూరమవుతాయి. 
 
రోజూ అరటిపండ్లు తింటే కీళ్ల మధ్యలో గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే నొప్పులు తగ్గుతాయి. అరటి పళ్లలో ఉండే మెగ్నీషియం కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలిగించటంతో పాటు ఎముకల సాంద్రతను పెంచుతుంది. బ్లూ బెర్రీలు తరచుగా తింటే బ్లూ బెర్రీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు నొప్పులు, వాపులను తగ్గించటంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చేపలు కనీసం వారానికి మూడు రోజులు తినే వారిలో కీళ్ల నొప్పుల సమస్యలు దూరమవుతాయి. 
 
గ్రీన్ టీలో ఉండే యాంటి ఆక్సిడెంట్లు నొప్పులు, వాపులను తగ్గించటంతో పాటు ఎముకల సాంద్రతను పెంచి ఎముకలు విరగకుండా చూస్తాయి. నారింజ పండ్లు రోజూ తింటే కీళ్ల నొప్పుల సమస్యలు తగ్గుతాయి. నారింజ పండ్లలో ఉండే విటమిన్ సి ఎముకలను ధృడంగా మార్చటంలో సహాయపడుతుంది. మార్కెట్ లో దొరికే పీనట్ బటర్ కూడా కీళ్ల నొప్పులను తగ్గించటంలో సహాయపడుతుంది. 
 
రాగులు, జొన్నలు, సజ్జలు రోజు వారీ ఆహారంలో తీసుకుంటే ఎముకలు దృఢంగా మారటంతొ పాటు కీళ్ల నొప్పులు తగ్గుతాయి. పచ్చి రొయ్యలను కూరగా తింటే విటమిన్ ఇ సమృద్ధిగా లభించటంతో పాటు కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ప్రతి రోజు ఒక గ్లాసు పాలలో అర టీ స్పూన్ పసుపు కలిపి తాగినా కీళ్ల నొప్పులు తగ్గుముఖం పడతాయి. పైనాపిల్ తిన్నా కీళ్ల నొప్పుల సమస్య నుండి సులభంగా బయటపడవచ్చు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: