ఈ సీజన్లో దొరికే పండ్లలో కమలాఫలం ముఖ్యమైనది. ఆరెంజ్(క‌మ‌లా పండు) ఫ్లేవర్ సాధారణంగా అందరికి ఇట్టే నచ్చుతుంది. క‌మల పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా. ఇందులో విటమిన్ C, ఫాస్పరస్, పొటాషియం, బీటా కెరోటిన్, ఆల్కహాల్స్ వంటివి పుష్కలంగా లభిస్తాయట. ప్రతి రోజు ఒక ఆరెంజ్‌ కనుక తింటే చూపుకు సంబంధించిన సమస్యలు రావు అంటున్నాయి కొత్త అధ్యయనాలు. క‌మ‌లా జ్యూస్ తాగ‌డం వ‌ల్ల వల్లపక్షవాతం ముప్పు కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.  ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగాల్ని నియంత్రించడంతో పాటు, వయసును మీద పడనివ్వవట. అయితే కమలాలు ప్రతీ ఒక్కరికి మంచివే. 

 

కానీ రోజుకీ 3 కమలాలని మించి తినకూడదట. ఒక్కటైతే సరిపోతుందట. అలాగే భోజనానికి ముందు కానీ, ఖాళీ కడుపుతో కానీ ఈ పండ్లను అస్సలు తీసుకోకూడదట. ఎందుకంటే ఇందులోని ఆమ్లాలు పొట్టలోని గ్యాస్ట్రిక్ ఆమ్లాన్ని మరింత పెంచుతాయి. అలాగే పాలు తాగాక వెంటనే కమలాల జ్యూస్ తాగకూడదట. కనీసం గంట వ్యవధి ఉండాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే పాలలోని ప్రోటీన్లు కమలాలలోని ఆమ్లంతో కలిసి జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. ఇక‌ క‌మ‌లా పండ్లు కేవ‌లం తిన‌డానికే కాదు ఎన్నో ర‌కాలుగా ఉప‌యోగ‌పడుతుంది. 

 

విశ్రాంతి లేకుండా పనిచేయటం, రోజుకో షిఫ్టులో పనిచేయటం, పోషకాహార లోపం, నిద్రలేమి, మానసిక ఒత్తిడి వంటి కారణాల వల్ల కంటికింద ఏర్పడే నల్లని వలయాలకు రెండు చెంచాల కమలా రసం, అంతే మొత్తం పాలు కలిపి దూదితో రోజూ రాసి కడుగుతుంటే వలయాలు తొలగిపోతాయి. మ‌రియు రంగు తక్కువగా ఉన్నవారు 2 చెంచాల చొప్పున కమలా, నిమ్మరసాలను కలిపి దానికి అరచెంచా తేనె జోడించి ఆ మిశ్రమంతో రోజూ ముఖం, మెడ భాగాలను మర్దనా చేసి ఆరిన త‌ర్వాత‌ కడిగితే చర్మం రంగు మెరుగుపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: