లైంగిక సామర్థ్యం కోసం ఇప్పుడు చాలా మందులు వచ్చాయి. వీటిలో వయాగ్రా వంటి వాటి గురించి తెలుసు. కానీ.. ఈ మందులు చాలా ఖరీదైనవి ఉంటాయి. కానీ ఎలాంటి ఖర్చు లేకుండా లైంగిక సామర్థ్యం పెంచుకునేందుకు పైసా ఖర్చు లేకుండా ప్రకృతి ప్రసాదించిన వర ప్రసాదాలు చాలా ఉన్నాయి.

 

కాకపోతే వీటి గురించి చాలా మందికి తెలియదు. అలాంటి వాటిలో ఒకటి ఈ దూసర ఆకు. దీన్నేదూసరి తీగ, పాతాళ గరిడి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇది పంటపొలాల్లో మొలిచి.. చెట్లపైకి పాకుతుంది. దీని వేళ్లు పాతాళానికి వెళ్తాయని అందుకే దీనికి ఈ పేరు. భూమిలోపల ఓ ఓ గడ్డ ఏర్పడుతుందట. దీని తీగలు చాలా బలంగా ఉంటాయి.

 

దీన్ని తెలంగాణ పల్లెటూళ్లలో శిబ్బి తీగ అని కూడా అంటారు. దీనిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయట. ఇది వేడి తగ్గిస్తుంది. మగవారిలో లైంగిక సామర్థ్యం అమాంతం పెంచుతుందట. ఈ దూసర ఆకును రసంలా తీసుకోవచ్చు. లేదా.. దీన్ని లేహ్యంగానూ తీసుకోవచ్చు.

 

ఈ ఆకు, తీగలను ఎండబెట్టి.. పొడుం చేసుకుని ద్రవాలతో కలిపి తీసుకోవచ్చని నిపుణలు చెబుతున్నారు. దీన్ని క్రమం తప్పకుండా వాడితే మగవారిలో సెక్స్ సామర్థ్యం బాగా పెరుగుతుందని ఔషథ నిపుణులు చెబుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: