తేనీటి ఘుమఘుమలకు టీ ప్రియులు ఫిదా అవుతున్నారు. నిత్య జీవనంలో టీ ప్రముఖ పాత్రే పోషిస్తోంది. మూడు దశాబ్దాల కిందట ఒకటీరెండు రకాల తేనీరే అందుబాటులో ఉండేది. కప్పు రూ.0.15 పైసలతో మొదలై.. ఇప్పుడు రూ.15కు చేరింది. బయట చిరుజల్లులు. ఆహ్లాదకరమైన వాతావరణం. వేడివేడిగా తేనీటి చుక్కలు గొంతులోకి దిగుతుంటే భలే ఉంటుంది కదూ. ఇద్దరు మిత్రులు కలవగానే నోటి నుంచి వచ్చే మొదటి మాట ‘టీ తాగుదాం భయ్యా’, ‘టీ తాగుదాం బాబాయ్‌..’, స్ట్రాంగ్‌ చాయ్‌ తాగుదాం మావా..’. ఇక విద్యార్థులైతే ఒన్‌బైటూ చాయ్‌ చెబుతారు. బందువులు ఇంటికి రాగానే తేనీటి సేవనంతోనే కబుర్లు మొదలవుతాయి. మనసు చికాకు పుట్టినా.. కొత్తవారితో దోస్తీ కట్టినా.. వాన పడినా.. మంచు కురిసినా, ఎండ కాసినా టీ రుచులను ఆస్వాదించాల్సిందే. చిరుద్యోగి నుంచి కార్పొరేట్‌ కంపెనీ సీఈఓ వరకు రోజుకు ఒక్కసారైనా టీ సేవించాల్సిందే. టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్యకరమైన లాభాలను గురించి తెలుసుకుని కొంతమంది తమ డెయిలీ యాక్టివిటీస్‌లో టీ తాగడాన్ని ఓ భాగం చేసుకున్నారు. గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలో మాత్రమే కాదు.. కొలెస్ ట్రాల్ తగ్గించడం, చర్మాన్ని రక్షించడం, క్యాన్సర్‌ను నివారించడం, ఎముకలు, దంతాలు గట్టిగా చేయడం వంటి లక్షణాలు టీకి ఉన్నాయన్నది కొన్ని అధ్యయనాల మాట. టీ లో మరికొన్ని రకాలు ఇప్పుడు తెలుసుకుందాం..


గ్రీన్‌ టీ..
   ప్రాసెసింగ్‌ సమయంలో అతి తక్కువ ఆక్సిడేషన్‌ కామోల్లియా సైనెసిన్‌ ఆకులను ఉంచడం ద్వారా గ్రీన్‌ టీ రూపుదిద్దుకుంటుంది. చైనాలో పుట్టిన గ్రీన్‌ టీ కల్చర్‌ ఇప్పుడు ఆసియాలో బాగా ఫేమస్‌. వెస్ట్‌లో కూడా ఇటీవల ఆరోగ్య కారణాల రీత్యా ఎక్కువగా తీసుకుంటున్నారు. నగరంలో కూడా ఇదే రీతిలో ఆరోగ్య కారణాలు చెప్పి తాగుతున్న వారు ఉన్నారు. స్పాలలో గ్రీన్‌ టీ ప్రత్యేకంగా సర్వ్‌ చేస్తున్నారు.


ఊలాంగ్‌ టీ..
సంప్రదాయ చైనీస్‌ టీ ఈ ఊలాంగ్‌ టీ. కర్లింగ్‌, ట్విస్టింగ్‌కు ముందు సూర్యకాంతిలో ఎండబెట్టి ఆక్సిడేషన్‌ చేస్తారు. చాలా వరకు ఊలాంగ్‌ తేయాకులను ప్రత్యేక ప్లాంటేషన్స్‌లో పండిస్తారు


వైట్‌ టీ..
లైట్లీ ఆక్సిడైజ్డ్‌ టీ. ఇది కూడా చైనా రకమే. చైనీస్‌ కామెల్లియా సైనెసిన్‌ ప్లాంట్‌ నుంచి వస్తుంది. మొగ్గలు, లేత ఆకులను సూర్యకాంతిలో ఎండబెట్టి లైట్‌ గా ప్రాసెస్‌ చేసి వైట్‌ టీ క్యారెక్టర్స్‌ కాపాడతారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: