ఈ మధ్య కాలంలో చాలామంది రక్తహీనత సమస్యతో బాధ పడుతున్నారు. సాధారణంగా కొన్ని జబ్బులకు ముందస్తు లక్షణాలు కనిపిస్తాయన్న విషయం తెలిసిందే. అదే విధంగా రక్తహీనత సమస్యతో బాధ పడేవారికి కూడా కొన్ని లక్షణాలు కనపడతాయి. రక్తహీనత సమస్యను ముందుగానే గుర్తిస్తే సమస్య నుండి బయట పడవచ్చు. రక్తహీనత సమస్యతో బాధ పడే వారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడతారు. 
 
రక్తహీనత సమస్యతో బాధ పడేవారిలో రక్తకణాల సంఖ్య తక్కువగా ఉండటం వలన చర్మం రంగు పాలిపోయి తెలుపు రంగులో లేదా బూడిద రంగులో కనిపిస్తుంది. రక్తహీనత సమస్యతో బాధ పడేవారిలో గుండె ఆక్సిజన్ ను సరఫరా చేయటానికి ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. ఛాతి భాగంలో నొప్పి ఎక్కువగా వస్తుంటే అందుకు రక్తహీనత కూడా కారణమయ్యే అవకాశం ఉంది. రక్తహీనత సమస్యతో బాధ పడేవారికి పెన్సిల్, సున్నం, మంచు ముక్కలు, పెయింట్ తినాలనిపిస్తుంది. 
 
ఇలాంటి వింత లక్షణాలు ఉంటే కూడా దానికి రక్తహీనత సమస్య కారణమయ్యే అవకాశం ఉంది. శరీరం ఎల్లప్పుడూ చల్లగా ఉన్నా కూడా అందుకు రక్తహీనత కారణమయ్యే అవకాశం ఉంది. తరచూ తలనొప్పి వస్తున్నా కూడా అందుకు రక్తహీనత సమస్య కారణమయ్యే అవకాశం ఉంది. చిన్న చిన్న పనులకే అలసిపోవడం, ఆయాసం, గోళ్లు పాలిపోయినట్లు ఉండటం, బలహీనంగా ఉండటం కూడా రక్తహీనత లక్షణాలుగా చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: