రోగం వచ్చినప్పుడు హాస్పిటళ్లు, డాక్టర్లు చుట్టూ తిరగడం ఇప్పుడు జనాలకు బాగా అలవాటు అయ్యింది. అయితే ఆ రోగం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం తీసుకోరు. వ్యాధి సోకకముందే తగిన జాగ్రత్తలు తీసుకుంటే అది ఎక్కువ ఎఫెక్ట్ ఇవ్వకుండా చేయగలిగే అవకాశం ఉంటుంది. సాధారణగా సీజనల్ ఫుడ్ తినడం వల్ల కొన్ని రోగాలను చెక్ పెట్టవచ్చు. అందులో ఈ కాలం దొరికే మొక్కజొన్నల వల్ల చాలా లాభాలు ఉన్నాయి. 

 

చలికాలంలో మొక్కజొన్న కండెలు కాల్చుకుని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు వైద్య నిపుణులు. పీచు పదార్ధం ఎక్కువగా ఉండే మొక్క జొన్నను తినడం వల్ల జీర్ణకిర్య సక్రమంగా జరిగేందుకు ఉపయోగపడుతుందని అంటున్నారు. మలబద్ధకం, మొలలు వటి వ్యాధులను నియంత్రించే శక్తి మొక్క జొన్నకు ఉందట. పేగు క్యాన్సర్ ను అరికట్టేందుకు మొక్కజొన్నలు బాగా ఉపయోగపడతాయని తెలుస్తుంది.

 

మొక్కజొన్న గింజలలో మిన్రల్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిలో మెగ్నీషియం, ఐరన్,కాపర్, పాస్పరస్ వట్టివి ఎముకల గట్టిదనానికి బాగా ఉపౌయోగపడతాయని తెలుస్తుంది. అంతేకాదు మొక్కజొన్న లోని యాంటీ యాక్సిడెంట్లు చర్మ కాంతికి ఉపయోగపడతాయి. దద్దుర్లు రాకుండా అరికడుతుంది.

 

ప్రెగ్నెన్సీ లేడీస్ కు మొక్కజొన్న బాగా ఉపయోగపడుతుంది. ఫోలిస్ యాసిడ్ కాళ్లు, చ్తులు వాపురాకుండా చేస్తుంది. కడుపులోని బిడ్డ బరువుకి సహకరిస్తుంది. మొక్కజొన్న గింజలను నీటిలో ఉడకబెట్టి తాగాలి. మూత్రపిండాల వ్యాధితో బాదపడే వారికి ఇది మంచి ఔషదం. రక్తహీనతతో బాధపడే వారికి మొక్కజొన్న అద్భుతంగా పనిచేస్తుంది.  నిప్పు మీద కాల్చిన మొక్కజొన్నలను తినడం వల్ల దంతాలు దృడంగా ఉంటాయి. నోటి దుర్వాసన కూడా రాకుండా చేస్తుంది.  ఇన్ని ప్రయోజనాలు ఉన్న మొక్కజొన్నలను అసలు మిస్ అవ్వొద్దు. ఏదైనా జరిగిన తర్వాత తెలుసుకోవడం కన్నా ముందే కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటిస్తే డాక్టర్ దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: