ఈ మధ్య కాలంలో మన నిత్య జీవితంలో ప్లాస్టిక్ వస్తువులను ఎక్కువగా వాడుతున్నాం. తాగటానికి, తినటానికి కూడా ప్లాస్టిక్ వస్తువులనే ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. ప్లాస్టిక్ గ్లాసుల్లో, ప్లాస్టిక్ బాటిల్స్ లో నీటిని తాగుతోంటే ప్లాస్టిక్ ప్లేట్లలో భోజనం చేయటానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తున్నాం. కానీ వైద్యులు ప్లాస్టిక్ తో తయారైన వాటిలో తినటం, తాగటం ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరం అని చెబుతున్నారు. 
 
అమెరికన్ పరిశోధకులు చేసిన ఒక పరిశోధనలో ప్లాస్టిక్ తో తయారైన వాటిలో తినడం, తాగడం వలన ప్లాస్టిక్ సూక్ష్మ కణాలు తెలియకుండానే శరీరంలోకి చేరతాయని పరిశోధనలు చేసి తేల్చారు. అమెరికన్ పరిశోధకులు కొంతమందిపై ఈ పరిశోధనలు చేయగా వారి మూత్రంలో ఉండాల్సిన దాని కంటే 44 రెట్లు ఎక్కువగా ప్లాస్టిక్ సూక్ష్మ కణాలు ఉన్నాయని తేల్చారు. శరీరంలో ప్లాస్టిక్ సూక్ష్మ కణాలు ఎక్కువైతే మెదడు దెబ్బతినటంతో పాటు సంతానోత్పత్తి సమస్యలు ఏర్పడతాయని పరిశోధకులు చెబుతున్నారు. 
 
అమెరికన్ పరిశోధకులు ప్లాస్టిక్ శరీరంలో ఉండాల్సిన దానికన్నా ఎక్కువైతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. మరో అధ్యయనంలో మన దేశంలో విక్రయించే ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలలో చక్కర స్థాయిలు, కొవ్వు స్థాయిలు ప్రమాదకరంగా ఉన్నాయని తేలింది. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నిపుణులు ప్యాకేజ్డ్ ఫుడ్ ఎక్కువగా తినే వారిలో హార్ట్ కు సంబంధించిన రోగాలు, ఒబేసిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అందువలన వీలైనంతవరకు ప్లాస్టిక్ తో తయారైన వస్తువులను తినడం, తాగడం కొరకు వినియోగించటానికి, ప్యాకేజ్డ్ ఫుడ్స్ కు దూరంగా ఉంటే మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: