డయాబెటిస్.. భారత్ లో రోజు రోజుకు డయాబెటిస్ వారి సంఖ్య పెరిగిపోతుంది. ఈ డయాబెటిస్ వల్ల ప్రాణానికి ఏ ముప్పు లేకపోయినప్పటికీ గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే డయాబెటిస్ కంట్రోల్ అవ్వవాలంటే చాలా కష్టం. అలాంటి ఈ డయాబెటిస్ కు చెక్ పెట్టడం పక్కన పెడితే అసలు ఈ డయాబెటిస్ పెరగకుండా ఉండాలంటే ఏమి పాటించాలో ఇక్కడ చదివి తెలుసుకోండి. 

                                       

ఈ కాలంలో చిన్నవారికి కూడా డయాబెటిస్ వస్తుంటుంది. అయితే ఆ చిన్నవారు ఎంత తిండిని కంట్రోల్ చేసిన సరే ఈ డయాబెటిస్ తగ్గకుండా ఉంటుంది. అయితే ఈ డయాబెటిస్ గురించి తాజాగా ఓ విషయం తెలిసింది. అది ఏంటి అంటే.. జీవిత భాగస్వామితో తరచుగా తగువులు పడేవారికి ఆ గొడవల ప్రభావం మనసు మీదే కాదు ఆరోగ్యం మీదా పడుతుందని చెప్తున్నారు వైద్య నిపుణులు. పెన్సిల్వేనియా స్టేట్‌ యూనివర్శిటీ పరిశోధకులు చేపట్టిన పరిశోధనలో, తరచుగా జీవిత భాగస్వాములతో తగాదాలు పడుతూ ఉండేవాళ్లలో ఆర్థ్రయిటిస్‌, మధుమేహం సమస్యలు మరింత పెరు గుతున్నట్టు తేలింది. 

                                               

ఆర్థ్రయిటిస్‌, మధుమేహం సమస్యలు ఉన్న రెండు వర్గాల వ్యక్తుల మీద విడివిడిగా జరిపిన పరిశోధనలో, జీవిత భాగస్వామితో తగాదాలు పడ్డవాళ్లు అదే రోజున వారి ఆరోగ్య సమస్యల తీవ్రత పెరిగినట్టు చెప్పారు. కాబట్టి ఆరోగ్య సమస్యలు మరింత దిగజారకుండా ఉండాలంటే జీవిత భాగస్వామితో తగువులు పడడం మాని సానుకూలంగా సమస్యలు పరిష్కరించుకోవడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: