సాధారణంగా పిల్లల్లో స్ట్రోక్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. కానీ, దానివల్ల తీవ్ర అనారోగ్యానికి గురై, ప్రాణాపాయం కూడా సంభవించే ప్రమాదముంది. పెద్దల కంటే పిల్లల్లో స్ట్రోక్ ప్రభావం చాలా విభిన్నంగా ఉంటుంది. దానివల్ల వచ్చే విభిన్నమైన ముప్పు వల్ల పిల్లల్లో పలు రకాల దుష్ప్రభావాలు తలెత్తుతాయి. గతం కంటే ఇటీవలి కాలంలో పిల్లల్లో స్ట్రోక్ ఘటనలు చాలా పెరిగినా, దాన్ని గుర్తించడంలో తరచు ఆలస్యం అవుతోంది, కొన్నిసార్లు సరిగా గుర్తించకపోవడం లేదా అసలు తప్పుగా గుర్తించడం లాంటి సమస్యలూ వస్తున్నాయి. 

దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఆసుపత్రులలో ఒకటిగా శరవేగంగా విస్తరిస్తున్న ఎస్.ఎల్.జి. ఆసుపత్రులలో కన్సల్టెంట్ న్యూరాలజిస్టుగా వ్యవహరిస్తున్న డాక్టర్ సుమ వద్దకు ఇటీవల 12 ఏళ్ల బాలిక వచ్చింది. ఆమె వైరల్ జ్వరంతో బాధపడి, అది తగ్గిన తర్వాత కూడా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోడానికి ఆమెకు పలు రకాల వైద్యపరీక్షలు చేశారు. చాలావరకు సాధారణంగానే ఉన్నా, కాంట్రాస్ట్ ఎంఆర్ఏలో మాత్రం, మెడలోంచి వెళ్లే పెద్ద ధమని సన్నబడుతున్నట్లు గుర్తించారు. దాంతోపాటు.. వెసెల్ వాల్స్ లో వాపు కూడా కనిపించింది. 

దాంతో డాక్టర్ సుమ, ఎస్.ఎల్.జి. ఆసుపత్రులలోని ఇతర నిపుణుల బృందం కలిసి రెండు రోజుల క్రితం బాలికకు ‘స్ట్రోక్’ వచ్చినట్లు గుర్తించారు. కానీ, ఆమె తల్లిదండ్రులు మాత్రం బాలికలో వచ్చిన మార్పులను గమనించలేకపోయారు. అది ఇషెమిక్ స్ట్రోక్. ధమనులు మూసుకుపోవడం వల్ల ఇలా జరిగింది. దానివల్ల మెదడుకు రక్తప్రసారం తగ్గిపోతుంది. వైరల్ జ్వరాలు వచ్చి తగ్గిన తర్వాత ఇలా జరిగే అవకాశం ఉంది. రోగి వైరల్ ఇన్ఫెక్షన్ తో పోరాడి, బాగా నీరసించిపోతారు. అప్పుడే స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది.  ఇన్‌ప్లూయెంజా లాంటి సాధారణ ఇన్ఫెక్షన్ల తర్వాత కూడా ఈ సమస్య తలెత్తవచ్చు. పాప సమస్య ఏంటన్నది గుర్తించి, నిర్ధారించిన తర్వాత ఆమెకు సరైన చికిత్స చేసి, ఆమెను సాధారణ స్థితికి తీసుకొచ్చారు. స్ట్రోక్ వచ్చి, నెల రోజుల పాటు చికిత్స తీసుకున్న తర్వాత పాప ఇప్పుడు తన పనులు తాను చేసుకోగలుగుతోంది. 

12 ఏళ్ల పాపకు అందించిన చికిత్స గురించి, ఈ సమస్య గురించి ఎస్.ఎల్.జి. ఆసుపత్రులలో కన్సల్టెంట్ న్యూరాలజిస్టు డాక్టర్ సుమ మాటల్లోనే... నిరంతర పర్యవేక్షణ, సరైన చికిత్సా పద్ధతుల వల్ల పాప దాదాపు మృత్యుముఖం వరకు వెళ్లి, నెలరోజుల్లో పూర్తిగా కోలుకుంది. కానీ, వైరల్ జ్వరాలు వచ్చి తగ్గిన తర్వాత పిల్లల్లో వచ్చే మార్పుల విషయంలో తల్లిదండ్రులు అత్యంత అప్రమత్తంగా ఉండి, వారిని పరిశీలిస్తుండాలి. ఏదైనా ఒక అనారోగ్యం వచ్చి తగ్గిన తర్వాత పిల్లలు ఏదైనా విభిన్నమైన సమస్య గురించి చెబితే, తదుపరి సమస్యలు ఏమైనా ఉన్నాయేమో గుర్తించేందుకు తగిన వైద్య పరీక్షలు చేయించాలి. పిల్లలు యుక్తవయసులోకి వచ్చే సమయంలో వాళ్ల అలవాట్ల విషయంలోనూ తల్లిదండ్రులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి’’ అని ఆమె చెప్పారు. 


ముందుగానే ఈ పరీక్షలతో పసిగట్టవచ్చు..


ఎస్.ఎల్.జి. ఆసుపత్రులు హైదరాబాద్ నిజాంపేటలోని బాచుపల్లిలో ఉన్నాయి. వివిధ ప్రత్యేక విభాగాలలో రోగుల కోసం 999 పడకలున్నాయి. సమగ్ర వైద్యసేవల కోసం అవసరమైన అన్నిరకాల వైద్య సదుపాయాలు ఉన్నాయి. ముందస్తు ఆరోగ్య సంరక్షణ విభాగంలో భాగంగా అన్ని వయసుల వారికి వైద్య పరీక్షలున్నాయి. ప్రస్తుత జీవనశైలి కారణంగాను, వ్యక్తిగత లేదా కుటుంబ ఆరోగ్య చరిత్ర కారణంగాను వచ్చే ముప్పును ముందుగానే ఈ పరీక్షలతో పసిగట్టవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: