జొన్న  ఆధారిత మిడ్-డే భోజనం మూడు నెలల్లో పిల్లల వృద్ధిని 50 శాతం పెంచుతుందని నీతి అయోగ్  ఒక నివేదికను విడుదల చేసింది. కర్ణాటక లో 1,500 మంది పిల్లలపై  అధ్యయనం జరిపిన తర్వాత   నీతి అయోగ్ ఈ ప్రకటన చేసింది.   పిల్లలలో బరువు , పొడవు పరంగా పెరుగుదల  గుర్తించబడిందని పరిశోధన లో భాగమైన ఇక్రిశాట్  శాస్త్రవేత్తలు పేర్కొన్నారు .  జొన్నలు ఆహారం లో తీసుకోవడం  ద్వారా   శరీరం  పోషకలను  గ్రహించి ఎత్తు పరంగా కూడా పిల్లలలో పెరుగుదల కనిపించింది అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.  జొన్నలు పిల్లలకు  మంచి శక్తిని అందించి , వారు  శారీరకంగా చురుకుగా ఉండేటట్టు దోహదపడతాయి. 

 

 

 

 

 

 

 

 

 

ఈ అధ్యయనం యొక్క ఫలితాలను నితి ఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ రమేష్ చంద్ , న్యూ ఢిల్లీ లో  భారత ప్రభుత్వానికి చెందిన  రెట్టింపు రైతుల ఆదాయం సంస్థ   చైర్మన్  డాక్టర్ అశోక్ దల్వాయి సంయుక్తంగా విడుదల చేశారు.   బియ్యానికి ప్రత్యామ్నాయంగా జొన్నలను  ప్రచారం చేస్తున్నారు. జొన్నలను రైతులు ఎక్కువగా పండించేటట్టు   ఇక్రిశాట్  శాస్త్రవేత్తలు, వాళ్ళను ప్రోత్సహిస్తున్నారు, ఎందుకంటే ఇది ఎక్కువ నీరు అవసరం లేని పంట. వాతావరణంలో మార్పులు మరియు నీటి కొరత వంటి ప్రతికూల పరిస్థితులలో కూడా దీనిని పండించవచ్చు. అందువల్ల జొన్న పంట  రైతులకు మంచి ఎంపిక. కర్ణాటకలో మధ్యాహ్నం భోజనం ‘స్మార్ట్ ఫుడ్’ అధ్యయనంలో ఒక భాగం, ఇక్కడ జొన్న  ఆధారిత మిడ్-డే భోజనం యొక్క అంగీకారం మరియు ప్రభావం అధ్యయనం చేయబడింది.

 

 

 

 

 

 

మేము భోజనానికి జొన్నలను  జోడించమని  చెప్పడం సరికాదు  అని ఇక్రిశాట్  లోని పోషకాహార నిపుణురాలు  మరియు అధ్యయనం యొక్క సంబంధిత రచయిత డాక్టర్ యస్  అనిత అన్నారు. జొన్న ఏ రకం,  అది ఎలా ఉడికించాలి మరియు దానితో ఏ  ఆహారాలు కలిపితే భోజనం లో   పోషకాల  విలువ పెరుగుతుందో గుర్తు పెట్టుకోవలసిన  కొన్ని ముఖ్య అంశాలు.  ఉదాహరణకు, సరైన రకమైన జొన్నలను  ఎంచుకోవడం ద్వారా భోజనంలో లభించే ఇనుము మొత్తాన్ని రెట్టింపు చేయవచ్చు.   పాఠశాల మధ్యన భోజన  కార్యక్రమంలో జొన్న  ఆధారిత భోజనం గురించి తెలిసిన మొదటి శాస్త్రీయ అధ్యయనం ఇది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: