కూరగాయలలో తియ్యటి కూరగాయ క్యారెట్. పిల్లలకు పెద్దలకు ఇష్టమైన వెజిటేబుల్ ఇది. క్యారెట్ చూస్తూనే తినేయాలనిపంచే రంగు, రుచి అట్రాక్ట్ చేస్తుంటుంది. అందుకే దీన్ని ఎక్కువగా సలాడ్స్ లో జోడిస్తుంటారు. అంతే కాదు, ఇంట్లో క్యారెట్ కనబడితే చాలు సింపుల్ గా చేతిలోకి తీసుకుని తినేస్తుంటారు. క్యారెట్‌లో ఏ, సి, కె విటమిన్లూ, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇందులోని ఏ విటమిన్‌ ఊపిరితిత్తుల్లో కఫం చేరకుండా చేస్తుంది. ఇక, సి విటమిన్‌ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. క్యారెట్టులో విటమిన్ ఏ, బీ, ఈతోపాటు పలు మినరల్స్ ఉండటం మూలాన కళ్ళల్లో సాధారణంగా ఏర్పడే హ్రస్వ దృష్టి, దూరదృష్టి లోపాలను సరిదిద్దుకోవచ్చు. 

 

పైగా కంటి చూపు మెరుగుపడుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. జుట్టు ఆరోగ్యంగా ఉండాలన్నా, చర్మం తాజాగా కనిపించాలన్నా... క్యారెట్ జ్యూస్‌ మించింది లేదు. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు కూడా కరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే క్యారెట్ లో ఉండే సోడియం కంటెంట్ బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ చేస్తుంది. క్యారెట్ ను రెగ్యులర్ గా తినడం వల్ల బిపి కంట్రోల్లో ఉంటుంది. మ‌రియు క్యారెట్ తినడం వల్ల లివర్ క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది.

 

అయితే క్యారెట్ ను ఎక్కువగా తింటే మాత్రం కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కోవల్సి వస్తుంది. డయాబెటిక్ వారు క్యారెట్ ఎక్కువ తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. క్యారెట్ లో షుగర్ కంటెంట్ హైగ్లిజమిక్స్ 97 ఉంటుంది. ఇది గ్లూకోజ్ గా మారడంతో బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతాయి. అలాగే ఓవ‌ర్‌గా క్యారెట్ తిన‌డం వ‌ల్ల ఇరిటేషన్, నిద్రలేమి, నెర్వెస్ నెస్ మరియు వాటర్ బ్రాష్ వంటి నెగటివ్ ఎఫెక్ట్స్ ను ఎదుర్కుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: