వెక్కిళ్లు.. మనకు వస్తే.. మనల్ని ఎవరైన తల్చుకుంటున్నారను అని, లేదా తిట్టుకుంటున్నారు అని అనుకుంటూ ఉంటాం. అయితే సాధారణ వెక్కిళ్లు వచ్చినప్పుడు ఇలా అనుకుంటాం. అయితే ఆహారం తింటున్నప్పుడు, నీళ్లు లేదా ఇతర పానియాలు గబగబా తాగుతున్నప్పుడు వెక్కిళ్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. 

                                     

అలాంటప్పుడు ఏం చేయాలో తెలియదు. అయితే అలాంటి సమయంలో వంటగదిలోని చక్కెర, ఐస్‌వాటర్‌, తేనె వంటి పదార్థాలతో వెక్కిళ్లను క్షణాల్లో మాయం చేయగలవు. అది ఎలాగా అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

                              

ఒక స్పూను చక్కెర వెక్కిళ్ల నుంచి సత్వర ఉపశమనాన్ని ఇస్తుంది. వెక్కిళ్లను ఆపేందుకు చాలామందికి ఈ పద్ధతి తెలుసు.

                             

నాలుక కింది భాగంలో కొద్దిగా తేనె కలిపిన నీళ్లను కొద్దిసేపు ఉంచుకొని మింగాలి. అలానే కొద్దిసమయం శ్వాస ఆపి ఉంచితే వెక్కిళ్లు తగ్గిపోతాయి.

 

కొద్దిగా ఐస్‌వాటర్‌ను నోట్లో వేసుకొని పుక్కిలించాలి. ఇలాచేస్తే కండరాలు అకస్మాత్తుగా పట్టేయడం తగ్గి, వెక్కిళ్ల సమస్య తగ్గుతుందని న్యూయార్క్‌కు చెందిన కార్డియాలజిస్టులు చెబుతున్నారు.

                   

వెక్కిళ్లు వచ్చినప్పుడు నిమ్మకాయ కొరికి రసం తాగితే చాలు చిటికెలో ఉపశమనం లభిస్తుందని పరిశోధకులు చెప్తున్నారు. 

 

చూశారుగా.. ఈసారి వెక్కిళ్లు వచ్చినప్పుడు ఈ చిట్కాలు పాటించి మీ వెక్కిళ్లను అతి తక్కువ సమయంలో పోగొట్టుకునేలా చూసుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: