ప్రస్తుత రోజులలో చాల మంది ఎత్తు  పెరగాలి అని చాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చాల మంది ఉండాల్సిన ఎత్తు కంటే తక్కువ ఎత్తు ఉండడం మనం గమనిస్తూనే ఉంటాము. ఇలా ఎత్తు  పెరగకపోవడానికి చాల కారణాలు ఉంటాయి. అవే పోషకాహార లోపం, తల్లిదండ్రుల జీన్స్ ఇలాంటి అనేక కారణాలతో ఎత్తు పెరగడం వీలు కాదు. అలంటి వారి కోసం కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మీ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఇప్పుడు అవి ఏంటో తెలుసుకుందామా మరి... 

 

వాస్తవానికి కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఎత్తు పెరగడం చాల సులువు అని నిపుణులు తెలియచేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆహారంలో పోషకాహారం తక్కువగా ఉండడం వల్లే ఎత్తు పెరగరని అలాంటి వారు సరైన పోషకాహారం తీసుకోవడం వల్ల ఎత్తు పెరుగుతారని నిపుణులు తెలుపుతున్నారు. సాధారణంగా 21 ఏళ్ల వరకూ పొడవు పెరిగే అవకాశాలు చాల ఉంటాయి. ఈ వయసు దాటితే ఎత్తు పెరగడం అనేది చాల కష్టమే అనే చెప్పాలి. 

 


ముఖ్యంగా ఎత్తు పెరగడానికి శరీరానికి  కాల్షియం అవసరం ఉంటుంది. ఈ కాల్షియం  సోయా ప్రొడక్ట్స్‌లో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎత్తు పెరగాలనుకునేవారు సోయా ప్రొడక్ట్స్ అంటే సోయా బీన్స్, మిల్క్‌ని రెగ్యులర్‌గా మీరో తీసుకుంటే చాల మంచిది అని  నిపుణులు సూచిస్తున్నారు.

 

అలాగే  కాల్షియంకి కేరాఫ్ అడ్రస్ పాలు అని అంటూవుంటారు అందరు.. పాలలో కాల్షియంతో పాటు విటమిన్ డి, ప్రోటీన్స్ కూడా మనకి లభిస్తాయి. కాబట్టి రెగ్యులర్‌గా పాలు తాగడం వల్ల ఎత్తు పెరుగుతారు అని  నిపుణులు చెబుతున్నారు. ఇక మాంసం తీసుకోవడం వల్ల కూడా ఎత్తు బాగా పెరుగుతారు. మాంసం లో ఎత్తు పెరగడానికి కావాల్సిన అన్ని  ప్రోటీన్స్ లభిస్తాయి. ఇలా గుడ్డు, బెండకాయ, ఆకుకూరలు ఇలాంటి అన్ని తినడం వల్ల ఎత్తు   పెరుగుతారు అని నిపుణులు తెలుపుతున్నారు. మరి ఇక ఎందుకు ఆలస్యం ఈ చిట్కా లు అన్నీ పాటించి మీరు హైట్ పెరగడానికి ప్రయత్నించండి


 

మరింత సమాచారం తెలుసుకోండి: