ఎంతైనా బీరుతో వైద్యం చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు ఒక అద్భుతమని చెప్పవచ్చు.  ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఆల్కహాల్ కు దూరంగా ఉండాలంటూ సందు దొరినప్పుడల్లా క్లాసు పీకే వైద్య నిపుణులు ఏకంగా బీరుతో ఓ మనిషి ప్రాణాలు కాపాడటం నిజంగా గ్రేట్ కదా.  ఓ పేషంట్ ప్రాణం కాపాడేందుకు డాక్టర్లే స్వయంగా ఈ పని చేశారు. అసలు విషయానికి వస్తే.. 48 సంవత్సరాల వయస్సు ఉన్న గుయన్ వాన్ అనే వ్యక్తికి ఆల్కహాల్ పాయిజనింగ్ కు గురయ్యాడు. దీనితో ఆతని రక్తంలో మెథనాల్ స్థాయి ఉండాల్సిన దానికంటే 1,119 రెట్లు ఎక్కువగా ఉంది. మెథనాల్ ను లివర్ ప్రాసెస్ చేసే ప్రక్రియను మందగింప చేసేందుకు ఓ డాక్టర్ల బృందం తొలుత ఒక లీటర్ బీరును గుయన్ వాన్ పొట్టలోకి పంపారు.

ఈ తరహా వైద్య చికిత్స వియత్నాం జరిగింది. ఈ విషయంలో అక్కడి వైద్యులు సక్సెస్ అయినట్టే. ఆల్కహాలిక్ పాయిజనింగ్ నుంచి రోగి ప్రాణాలు కాపాడేందుకు బీరునే అస్త్రంగా వాడారు. అదేంటి ఎవరైనా బీరు చల్ల చల్లగా తాగుతూ ఆస్వాదిస్తారు. హాయిగా రిలాక్స్ అవుతూ మరి బీరు తాగడం పరిపాటి అలాంటిది ఏకంగా వైద్యులే ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగి  పొట్టలోకి బీరు పంపటం వినటానికి విడ్డురంగా ఉంది కాదు. ఇది నిజంగా నిజమే. ‘డెయిలీ మెయిల్’ పత్రిక ఈ విషయాన్ని వెల్లడించింది.   ఇదంతా నిజమేనా అనుకుంటున్నారా?. అదీ ఏకంగా ఐదు లీటర్లు బీరును బాడీలోకి ఎక్కించడమేంటనే కదా మీ సందేహం.

అవును మీరు  చదువుతున్నది నిజం. ఇంకేం  డాక్టర్లు వైద్యానికి బీరు వాడారు కదా?. ఎంచక్కగా చిల్డ్ బీరు తాగుతూ ఈ ఆదివారాన్ని ఎంజాయ్ చేద్దామంటే మందుబాబులు పొరబడినట్టే. శరీరంలోకి బీరును పంపి వైద్యం చేయటం అసాధారం అని చెబుతున్నారు. ఇలా వైద్యం దక్కించుకున్న బాధితుడు మూడు వారాల తర్వాత ఆస్పత్రి నుంచి హాయిగా ఇంటికెళ్లిపోయాడు. ఇందు కోసమని డాక్టర్లు  వివిధ దశల్లో మొత్తం ఐదు లీటర్ల బీర్ ను పంపి వైద్యం చేశారన్న మాట.అన్న మాటేంటి ఉన్న మాటే.  ఇలా చేసిన తర్వాత బాధితుడు కోమా నుంచి సృహలోకి వచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: