ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు చలితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సాధారణ ఉష్ణోగ్రత కన్నా దిగువకు చేరడంతో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ప్రజలు చలికి వణికిపోతున్నారు. ఉదయం పూట వ్యాయా మం చేసేవారు, వాకర్స్‌, జాగర్స్‌, కూరగాయల వ్యాపారులు, మున్సిపల్‌ కార్మికులు చలికి గజగజవణుకుతున్నారు. ఎన్నడూ లేని విధంగా నవంబర్‌ నుంచే ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాళ్లు, చేతులు, పెదవులు, ముఖం చలికి పగళ్లు వస్తున్నాయి. చిన్న పిల్లలను జాగ్రత్తగా ఉంచాలని వైద్యులు సూచిస్తున్నారు. 


అసలే శీతాకాలం.. డిసెంబరు నెల! హైదరాబాద్‌లో మామూలుగానే సాధారణ ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. ముసురుకు తోడు మరింతగా చలిగాలులు వీస్తుండడంతో ఇళ్ల నుంచి కాలు బయటపెట్టలేని పరిస్థితి ఉంది. బయటకు రావటానికే జనం ఇబ్బంది పడ్డారు. జాతీయ రహదారిపై పగలు కూడా హెడ్‌లైట్లు వేసుకుని వెళ్లాల్సి వచ్చింది. చలి నుంచి రక్షించుకునేందుకు స్వెటర్లు, క్యాప్‌లు ధరించి రోడ్లపైకి వెళుతున్నారు. చలి తీవ్రతను తట్టుకోలేక వరంగల్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, జగిత్యాల జిల్లాల్లో నలుగురు వృద్ధులు మరణించారు. 


విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత భారీగా పెరిగిపోయింది. ఏజెన్సీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో స్థానికులు చలికి గజగజ వణుకుతున్నారు. ఏజెన్సీలోని మినుములూరులో 11 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ట ఉష్నోగ్రత నమోదవ్వగా, పాడేరు, లంబసింగిలో 12 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక, అరకు, చింతపల్లిలో 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.


గ్రేటర్ హైదరాబాద్‌లో మరో నెల రోజులపాటూ వాతావరణం చల్లగానే ఉంటుందంటున్నారు అధికారులు. ఇప్పటికే చలి తీవ్రత వల్ల చాలా మందికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. జలుబు, దగ్గు ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతూ, డాక్టర్ల దగ్గరకు వెళ్తున్నారు. మరో నెల పాటూ మంచు కురుస్తూ ఉంటుందనీ, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ వాతావరణ అధికారులు కోరుతున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దట్టంగా పొగ మంచు కమ్ముకుంది. హైదరాబాద్ నుంచి ఉదయం బయలు దేరాల్సిన విమానాలు ఆలస్యంగా వెళ్తున్నాయి. కొన్ని విమన సర్వీసులను రద్దు చేశారు. హైదరాబాద్‌ రావాల్సిన కొన్ని విమానాల్ని బెంగళూరు ఎయిర్‌పోర్టుకి తరలించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: