మన రాష్ట్రంలో అంటే జగన్ మోహన్ రెడ్డి మద్యం ధరలను అమాంతం పెంచేసి మందు తాగే వారిని గణనీయంగా తగ్గించేస్తున్నాడు కానీ మిగతా చోట్ల అంతా బీరు ఏరులై పారుతోంది. అప్పుడెప్పుడో గిరీశం గారు పొగతాగని వాడు దున్నపోతై పుడతాడు అని అంటే... ఈరోజుటి ఆధునిక శాస్త్రవేత్తలు మాత్రం మద్యం తాగని వాడు నిజంగా దున్నపోతు అంటున్నారు. అలాగే ఈ రోజుల్లో కూడా ఆడ మగ తేడా లేకుండా అందరూ మద్యం తాగేస్తున్నారు. బీర్ల అయితే ఆడవాళ్ళు నీళ్లు తాగినట్టు తాగుతున్నారు.

 

తాజాగా ప్రముఖ జంతు సంరక్షణ సంస్థ (పెటా) ఇచ్చిన ఒక ప్రకటన మన మందుబాబులకు ఎక్కడలేని హుషారుని తీసుకొని వచ్చింది. వారు చెప్పింది ఏమిటంటే మనిషి ఆరోగ్యానికి రోజూ పాలు తాగడం కంటే ఒక బీరు తాగడమే చాలా మంచిది అని. చిన్నప్పుడు పిల్లలకి ఎముకలు గట్టి పడేందుకు పాలలో ఉండే క్యాల్షియం తోడ్పడుతుంది కాబట్టి పాలను ఇస్తారు కానీ క్రమేపీ ఒక వయసుకి వచ్చాక అసలు పాలు తాగకపోవడమే చాలా ఉత్తమం అంటున్నారు హార్వర్డ్ మెడికల్ స్కూల్ వారు. వారు చేసిన ఒక పరిశోధన మేరకు రిపోర్టు ఆధారంగా పెటా ఈ విషయాన్ని తెలియజేసింది.

 

సంపూర్ణ ఆరోగ్యం కోసం పాల కంటే బీర్ చాలా మంచిది అని చెప్తూ అందులో ఎలాంటి అనుమానాలు కూడా అక్కర్లేదని ఈ పరిశోధన చెప్పుకొచ్చిందట. పాల లాంటి డైరీ ప్రొడక్ట్స్ ఎక్కువగా తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు, ఒబేసిటీ, డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తున్నాయని ఈ పరిశోధనలో తేలినట్లు హెచ్చరించింది. పాల ఉత్పత్తుల వల్ల ఎముకల వ్యాధి సోకుతుందని తేల్చిచెప్పింది. కానీ బీరు తాగడం వల్ల ఎముకలు మరింత బలోపేతం అవుతాయి అని పెటా చెబుతోంది. అంతేకాకుండా మన గుండెకి బీరు చాలా మంచిదని... అది చెడు కొవ్వును తగ్గించడమే కాకుండా మూత్రపిండాలలోని రాళ్ళను కూడా రాకుండా నివారిస్తుందని వారి పరిశోధనలో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: