మూడేళ్ల నుంచి ఐదేళ్ల లోపు పిల్లలు చాలా వకాబులరీ నేర్చేసుకుంటారు. ప్లేస్కూల్లోనూ, పాఠశాలల్లోనూ వారు చుట్టుపక్కల పరిసరాలను గమనించి పదాలు నేర్చుకుంటారు. ఒక భాష నుంచి మరో భాషకు మారతారు. మూడేళ్ల లోపు మాతృభాషకు మాత్రమే పరిమితం అవుతారు. ప్రీ స్కూల్ కు వెళ్లాక హిందీ, ఇంగ్లీష్ కూడా నేర్చుకోవడం మొదలుపెడతారు.

 

ఇలా వకాబులరీ పెరిగినప్పుడు, భాషలు పెరిగినప్పుడు.. వాళ్లకు కాంపిటెన్సీ లెవల్స్ పెరుగుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు పిల్లలు ఒక్కోసారి ఒక పదానికి బదులు మరో పదం వాడుతుంటారు. తడబడుతూ ఉంటారు. ఇలాంటప్పుడే తల్లిదండ్రులు ఇది నత్తి అని భయపడుతూ ఉంటారు. ఈ విషయంలో తల్లిదండ్రులకు ఓ స్పష్టత అవసరం.

 

అయితే మూడేళ్ల నుంచి ఐదేళ్లలోపు పిల్లలు.. ఈ నత్తి అనే భయాన్ని వదిలించుకోవాల్సి ఉంటుంది. ఒకే పదాన్ని పలుసార్లు పలుకుతూ ఒత్తిడికి లోనవుతుంటారు. అయితే దీన్ని నత్తిగా భావించకూడదు. అలాగే కొత్త వాళ్ల ముందు పిల్లలు మాట్లాడాలంటే ఒత్తిడికి లోనవుతారు. ఆ క్రమంలో ఒకే పదాన్ని పలుసార్లు పలుకుతారు. నీ పేరు ఏంట్రా అని కొత్తవాళ్లు అడిగితే.. నా..నా.. నా..నా పేరు అంటూ మొదలుపెడతారు.

 

దీన్ని నత్తి అని అనుకోకూడదు. ఇది సర్వసాధారణం, మూడేళ్ల నుంచి ఐదేళ్లలోపు పిల్లలు ఇలా మాట్లాడితే దాన్ని నత్తిగా భయపడాల్సిన అవసరం లేదు. ఇది భాష నేర్చుకునే క్రమంలో ఓ సాధారణ పరిణామంగా భావించాలి. ఈ విషయంలో మీ పిల్లల గురించి ఇంకా సందేహాలుంటే స్పీచ్ థెరపిస్టు సహాయం తీసుకుంటే మంచిది.

 

పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్.. ప్రపంచ వ్యాప్తంగా.. స్పీచ్ డిలే, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, సైకలాజికల్ రుగ్మతలతో బాధపడుతున్న దాదాపు 80 కోట్ల మంది పిల్లలు మరియు పెద్దల జీవిత ప్రమాణాలు మెరుగయ్యేలా దశాబ్దాల రీసెర్చ్ తో కూడిన అత్యంత ప్రభావంతమైన స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, సైకలాజికల్ కౌన్సెలింగ్, ఛైల్డ్ డెవలప్ మెంట్, మరియు రీహేబిలిటేషన్ సర్వీసు అందిస్తున్న ఏకైక స్పెషల్ ఎడ్యు, హెల్త్ కేర్ సంస్థ.

 

పినాకిల్ బ్లూమ్స్ నెట్ వర్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా.. మిరాకిల్ అనే పెటేంటెడ్ టెక్నాలజీ సహాయంతో అత్యంత పారదర్శక థెరపీ సర్వీసులను అందిస్తున్న ఏకైక సంస్థ. వంద మందికి పైగా నిష్ణాతులైన థెరపిస్టులతోమీ పిల్లల బంగారు భవిష్యత్ కోసం పాటుబడుతున్న సంస్థ పినాలిక్ బ్లూమ్స్ నెట్ వర్క్. భారత ప్రభుత్వ  ప్రతిష్టాత్మకమైన స్టార్టప్ ఇండియా అవార్డు పొందిన భారత్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ వివరాల కోసం 9100181181 నెంబర్ లో నేడే సంప్రదించండి.












మరింత సమాచారం తెలుసుకోండి: