హిందువులకు పరమ పూజనీయమైన చెట్టు తులసి. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు తులసిని పరమ పవిత్రంగా కొలుస్తుంటారు.  తెలుగునాట తులసి మొక్క లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదేమో. అయితే పూజనీయమైనదే కాక తులసిలో లెక్కలేనన్ని ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. చాలా ఆరోగ్య సమతుల్యతను కాపాడ గల తులసి ఒక విధంగా ఫ్యామిలీ డాక్టర్ అని చెప్పవచ్చు. అయితే రోజూ ఉద‌యాన్నే ఒక క‌ప్పు తుల‌సి ఆకుల టీ తాగితే అద్భుత ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు.

 

మధుమేహ వ్యాధి గ్రస్తుల కు తులసి టీ చాలా అద్భుతం గా సహాయపడుతుంది. ఎందుకంటే వీటిలో ఉండే అన్-సాచురేటేడ్ ఫాటీ ఆసిడ్ లు రక్తంలో ఉండే అధిక చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. కొద్ది రోజుల పాటు తులసి టీ క్రమం తప్పకుండా తాగుతుంటే, ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించి కొత్త చర్మ కణాలను పునరుత్పత్తి చేస్తుంది. తులసి టీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మరియు బీటా కెరోటిన్స్ గుండెకు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. అందుకు తులసి టీని రెగ్యులర్ గా తాగడం చాలా మంచిది. మ‌రియు జీర్ణ స‌మ‌స్య‌లు పోతాయి. గ్యాస్‌, అసిడిటీ వంటివి పోగొడుతుంది.

 

తులసి టీని రెగ్యులర్ గా తాగడం వల్ల హెల్తీ డైట్ గా పనిచేస్తుంది. దాంతో కిడ్నీలలో రాళ్ళు ఏర్పడకుండా నివారిస్తుంది. పురాతన కాలం నుండే తులసిని ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తున్నారు. జబ్బుల నివారణ కోసం డాక్టర్స్ వద్దకు వెళ్లి ఎక్కువ డబ్బుతో పాటు, సమయం వ్రుదా చేయడం కంటే ఇటువంటి ఆయుర్వేదిక్ హెర్బల్ రెడీని ఎంపిక చేసుకోవడం మంచిది. ముఖ్యంగా కఫం పడుతున్న వ్యాధులపై తులసి అద్భుతంగా పనిచేస్తుంది. రక్తంతో కూడిన దగ్గు, కఫం పడుతున్నప్పుడు తుల‌సి టీ మంచిది.

 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: