ప్రపంచ వ్యాప్తంగా  అత్యధిక మరణాలు సంభవించేది కేవలం గుండెపోటు ద్వారానేనని , ఆ తరువాత షుగర్ వ్యాధి బారినపడి చనిపోతున్న వారి సంఖ్య అధికంగా ఉందని, ఆ తరువాత మూడవ స్థానంలో క్యాన్సర్ కారణాల వలన చనిపోయే వారు అధికంగా ఉన్నాయరని ఓ అధ్యయనంలో తెలిసింది. ఈ గుండె పోటు వలన చనిపోయే వారిలో అత్యధికులు మగవారేనని ఈ అధ్యయనం తెలిపింది. అయితే ఈ మధ్యకాలంలో ఆడవారిలో కూడా అత్యధికంగా గుండె పోటు వలన మరణాలు సంభవిస్తున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. దీనికి ప్రధాన కారణం...

 

మారుతున్న కాలంలో మహిళల యొక్క రోజువారి దైనందిక జీవితంలో చోటుచేసుకుంటున్న భారీ మార్పులేనని తేలింది. పూర్వం కంటే ప్రస్తుత కాలంలో మహిళలు ఉద్యోగాలు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. దాంతో ఇంట్లో చక్కబెట్టాల్సిన పనులు అదే క్రమంలో ఉద్యోగ భాద్యతలు ఈ రెండిటిని చక్కదిద్దుకోవడం తలకి మించిన భారంగా మారుతోంది. ఒక పక్క ఇంట్లో ఒత్తిడి మరో పక్క ఆఫీసులో ఒత్తిడితో మహిళలు తీవ్ర ఆందోళనకి లోనవుతున్నారట.ఇదే మహిళలలో గుండెపోటు రావడానికి ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు.

 

గర్భంతో ఉన్న సమయంలో మహిళలలో హార్మోన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుదని. ఆ సమయంలో వారికి షుగర్ వ్యాధి ఉంటే రక్త నాళాలు గట్టిపడి రక్త ప్రసరణ ఆగిపోతుందని తద్వారా గుండెపోటు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు వైద్యులు.

 

అధికశాతం గుండెపోటుకి గురవుతున్న వాళ్ళలో అధ్యతిక మహిళలు ఉద్యోగులేనని ఓ సర్వే తేల్చి చెప్పింది. ఎందుకంటే ఉద్యోగాలు చేసే మహిళలు అధికశాతం స్థూలకాయం బారిన పడుతున్నారని, ఆధునిక ఆహారపు అలవాట్లు వారికి అనారోగ్య సమస్యలతో పాటు అధిక బరువుని కలిగిస్తున్నాయని అంటున్నారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: