నిత్యం ఇంట్లో వంటల్లో ముఖ్య‌మైనది ప‌సుపు. ప‌సుపు లేకుండా వంట‌లు చేయ‌డానికి చాలా మ‌హిళ‌లు ఇష్ట‌ప‌డ‌రు. ప‌సుపు వంట‌లే కాదు ఆరోగ్యానికి మ‌రియు అందాన్ని కాపాడాటానికి కూడా చ‌క్క‌గా ప‌నిచేస్తుంది. పూర్వ కాలం నుండి వివిధ రకాల జబ్బులను నివారించడంలో పసుపును విరివిగా ఉపయోగిస్తున్నారు. పసుపు లో ఉండే యాంటి ఫంగల్ , యాంటి వైరల్ గుణాలు రోగ నిరోదక శక్తిని పెంచుతాయి తద్వారా మన శరీరం తోందరగా ఇన్ ఫెక్షన్ల భారీన పడకుండా కాపాడుతాయి. పసుపు కలిపిన పాలు తాగటం వలన ఆడవాళ్ళలో నెలసరి సమయంలో వచ్చే కడుపు నోప్పి , నడుము నోప్పి , చిరాకు వంటివి దరి చేరకుండా ఉంటాయి.

 

అయితే పసుపును తీసుకోవడం మంచిదే అయినప్పటికీ అది ఎక్కువ అయితే మాత్రం అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి. లివర్ ఇన్ఫ్లమేషన్ కు గురిఅయ్యే వారు, కాలేయ సంబంధిత సమస్యతో బాధపడే వారు పసుపును ఖచ్చితంగా నివారించాలి. పసుపులో ఉండే గుణాలు, మరింత కాలేయ సమస్యలను పెంచుతుంది. అలాగే గర్భిణీలు వారి త్రాగే పాలల్లో కొద్దిగా పసుపు చేర్చి త్రాగడం వల్ల పుట్టే పిల్లలు అందంగా పుడుతారని పసుపు పాలను సేవిస్తుంటారు. అయితే పసుపు చేర్చడం వల్ల ప్రీమెచ్యుర్ యుటేరియన్ కాంట్రాక్షన్, యుటేరియన్ బ్లీడింగ్ లేదా యుటేరియన్ లో నొప్పి వంటి సమస్యలకు దారితీస్తుంది.

 

ఇక కొన్ని సందర్భల్లో, పసుపు తీసుకోవడం వల్ల రీప్రొడక్టివ్ సిస్టమ్ మీద ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పురుషుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కొన్ని పరిశోధనల ప్రకారం ఎక్కువగా పసుపు తీసుకోవడం వల్ల స్పెర్మ్ తగ్గిస్తుందని నిర్ధారించారు. అలాగే శరీరంలో పసుపు మోతాదు ఎక్కువ అయితే రక్తంలో ఉండే తెలుపు, ఎరుపు రక్త కణాలకు ముప్పు ఏర్పడుతుంది.  మ‌రియు పసుపు ఎక్కువ తీసుకుంటే కీళ్ల నొప్పులు, వాపులు సంభవిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: