కొంతమందికి కుర్చీ కనిపిస్తే చాలు.. కుర్చీకి అతుక్కుపోతారు. అస్సలు లేవరు. కుర్చీ మీదే కూర్చొని అన్ని పనులు కానిచ్చేస్తుంటారు. అస్సలు లేవరు. అలాగే ఎంత సేపంటే అంత సేపు కూర్చుంటారు. మొద్దులా కూర్చుండి పోతారు. జాబ్ చేసేవాళ్లు, ఇతర వ్యాపారస్థులు కూడా అంతే. ముఖ్యంగా ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులైతే పొద్దున కూర్చుంటే సాయంత్రం దాకా లేవరు. మరి.. ఇలా మొద్దులా కుర్చీల్లో కూర్చునే వారు తొందర లోనే పోతారట. అంటే వాళ్ల ఆయుష్షు రోజు రోజుకూ తగ్గుతూ పోతుందట.


గంటల తరబడి కుర్చీలకు అతుక్కు పోయే వాళ్లకు డయాబెటిస్, గుండె సంబంధ వ్యాధులు ఎక్కువగా వస్తాయట. దీంతో వాళ్లు తొందరగా చనిపోయే ప్రమాదం ఉంటుందట. ఎక్కువగా కూర్చునే వాళ్లు శారీరక శ్రమ కూడా ఏం చేయరు. దీంతో తీవ్ర అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్టే అని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.


అయితే... ఎక్కువ సేపు కూర్చోటం వలన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయట. అల కూర్చోటం వలన రక్త ప్రసరణ సరిగా జరగక కాళ్ళు తిమ్మిర్లు పట్టడం వంటివి జరుగుతాయి. కనీసం గంటకు 2 నుంచి 3 సార్లు అయినా లేసి అటు ఇటు తిరగటం మంచిదని చెబుతున్నారు డాక్టర్లు.  


కెనడాలో రీసెంట్ గా ఓ అధ్యయనం చేశారట. 45 ఏళ్లకు పై బడిన వాళ్లపై ఈ పరిశోధన చేశారు. ఎక్కువ సేపు కదలకుండా టీవీ చూసేవాళ్లు, కంప్యూటర్ల ముందు పనిచేసేవారు, ఊరికే కుర్చీల్లో కూర్చునే వారితో ఈ రీసెర్చ్ చేశారు. వాళ్ల ఆరోగ్యాన్ని పరిశీలించి షాక్ అయ్యారు రీసెర్చర్లు. శారీరక శ్రమ చేసేవాళ్లతో పోల్చితే.. ఒళ్లు కదల్చకుండా అలాగే గంటల తరబడి కూర్చునే వీళ్లకు భయంకరమైన జబ్బులు వ్యాపించాయట. దీంతో వాళ్ల ఆయుప్రమాణం కూడా తగ్గుతుందని వాళ్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: