ఉరుకుల పరుగుల జీవితంలో కనీసం ఆరోగ్యం గురించి పట్టించుకునే సమయం ఉండడం లేదు ఎవరికి. డబ్బు సంపాదించాలనే ఆలోచనతో హెల్త్ గురించి అంతగా పట్టించుకోవడం లేదు ఎవరు. దీంతో వ్యాయామం నడక లాంటివాటికి దూరంగా ఉండడంతో భారీగా లావు పెరిగి పోతూ ఉంటారు. అలా పెరిగిన తర్వాత బరువు తగ్గడానికి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు జనాలు. జిమ్ కి వెళ్లడం డైట్ పాటిస్తూ ఉంటారు... అయినప్పటికీ చాలా మందిలో ఎలాంటి మార్పులు మాత్రం కనిపించదు. నేటి సమాజంలో అధిక బరువుతో బాధపడుతున్న వారు చాలా మంది ఉన్నారు. అధికంగా బరువు పెరగడానికి కారణం రోజువారీ వ్యాయామం చేయకపోవడం.. ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా మసాలాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం.

 

 

 నేటితరం  జనాలందరూ ఆరోగ్యాన్నిచ్చే ఆహారాన్ని తీసుకోవడం కంటే మసాలాలను దట్టించి క్రిస్పీ గా ఉండే ఆహారం వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అలాంటి ఆహారాలు తినడానికి  టేస్ట్ బాగానే ఉన్నప్పటికీ హెల్త్ పరంగా మాత్రం భారీ ఖాయంగా   మారి పోతారు. అయితే బరువు భారీగా పెరిగిపోయి బాధపడే వారు కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు బరువు తగ్గడానికి అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. మనకి అందుబాటులో ఉండే కొన్ని పండ్లు తింటే బరువు తగ్గొచ్చు అని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి.

 

 

 ఆపిల్ : ప్రతి రోజు ఆపిల్ తింటే వైద్యుడి అవసరం ఉండదు అంటుంటారు. ఎందుకంటే ఆపిల్ పండు నిండా పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఆపిల్ తింటే దాదాపు శరీరానికి 70 కేలరీలు లభిస్తాయి. ఆపిల్ తిన్నాక చాలాసేపటి వరకు ఆకలి వేయకుండా ఉంటుంది. అంతేకాకుండా ఆపిల్ రోజు తినడం వల్ల బరువు కూడా నియంత్రణలో ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. 

 

 

 పుచ్చకాయ : పుచ్చకాయలు 90 శాతం మేర నీరు ఉంటుంది. దీని నుంచి అందే క్యాలరీలు చాలా తక్కువ. అయితే పుచ్చకాయను ముక్కలుగా కట్ చేసుకుని బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా తీసుకుంటే... చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. తరచూ పుచ్చకాయ  తినడం వల్ల పొట్ట కూడా తగ్గిపోతుందని సూచిస్తున్నారు. టేస్ట్ పరంగా కూడా పుచ్చపండు చాలా బాగుంటుందని చెబుతున్నారు. 

 

 

 దానిమ్మ : పీచు ఎక్కువగా ఉండే ఈ పండు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. దానిమ్మ  మనం రోజు తీసుకోవడం ద్వారా బరువు తగ్గించడమే కాకుండా రక్తవృద్ధికి కూడా తోడ్పడుతుందని చెబుతున్నారు వైద్యులు. అంతే కాకుండా అధిక రక్తపోటును కూడా రాకుండా  చేస్తుందట. దానిమ్మ పండు ఒకటి తిన్న చాలా సేపు  ఆకలి వేయకుండా ఉంటుంది అని చెబుతున్నారు వైద్యులు. 

 

 

 బాదం : బాదం తినడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. బాదామ్  రోజూ తీసుకోవడం ద్వారా ఎప్పుడూ ఆక్టివ్ గా ఉండడానికి వీలు ఉంటుందట . అంతేకాకుండా బాదం తింటే బరువు తగ్గడానికి కూడా ఆస్కారం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాకుండా వైద్యుల సలహాలు తీసుకొని మరి కొన్ని చిట్కాలు పాటిస్తే బరువును ఈజీగా తగ్గే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: