ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ భారిన పడిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. చిన్న పెద్ద అని తేడ లేకుండా ఈ డయాబెటిస్ అందరికి వచ్చేస్తుంది. డయాబెటిస్ వచ్చిన వారు ఆ వ్యాధి వల్ల చనిపోయే ప్రమాదం తక్కువ ఉన్నప్పటికీ గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. అయితే డయాబెటిస్ ని మాయం అవ్వాలంటే ఈ చిట్కాలు పాటించండి. 

 

డయాబెటిస్ ఉన్నవారు ఎక్కువ అన్నం ఎక్కువగా తినకూడదు.. కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి.. పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.. ఇలా అన్ని రకాల సహజ కూరగాయలను ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటారు. అయితే సబ్జా విత్తనాలు తీసుకోవటం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన లాభాలు ఉన్నాయి. 

 

సబ్జా విత్తనాల్లో విలువైన పోషకాలు ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఈ పోషకాలు రెట్టింపు మేలు చేస్తాయి. గ్లూకోజ్‌, ఇన్సులిన్‌ టాలరెన్స్‌ను పెంచుతాయి. సబ్జాతో ఉన్న ఉపయోగాలు ఏంటంటే...


 
శరీరంలో తలెత్తే పలు రకాల ఇన్‌ఫ్లమేషన్లను ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌తో అదుపు చేయవచ్చు. ఈ పోషకం సబ్జాలో ఉంటుంది. వంద గ్రాములు సబ్జా విత్తనాల్లో 17.8 గ్రాముల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. అంతేకాదు సబ్జా విత్తనాల్లో అధికంగా ఉండే పీచు కూడా ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. ఈ విత్తనాల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు సంపూర్ణ ఆరోగ్యానికి తోడ్పడతాయి.


 
రక్తపోటు కలిగి ఉన్న డయాబెటిస్ వారు ప్రతి రోజూ క్రమం తప్పకుండా సబ్జా విత్తనాలు తింటే వారి సిస్టాలిక్‌ బ్లడ్‌ ప్రెషర్‌ తగ్గినట్టు పలు పరిశోధనల్లో తేలింది. రక్తపోటు తగ్గితే గుండె మీద పడే భారం కూడా తగ్గుతుంది. కాబట్టి సబ్జా విత్తనాలు తీసుకోవడం ద్వారా గుండె జబ్బులను అరికట్టవచ్చు. రోజంతా తరచుగా నీళ్లు తాగుతూ ఉండాలి. ఇలా చెయ్యడం వల్ల డయాబెటిస్ పూర్తిగా మాయం అవ్వకపోయిన తగ్గుతుంది అని పరిశోధకులు చెప్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: