ఆధునిక కాలంలో గుండె జబ్బుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే గుండె జబ్బులు ఇప్పుడు చిన్న వయసులోనే వస్తున్నాయి.  గుండెపోటు వచ్చిన వ్యక్తుల్లో గుండె రక్తప్రసరణ సాధారణ స్థాయి కంటే తక్కువుంటుంది. అందువల్ల ఆ వ్యక్తి నడిచినా, మెట్లెక్కినా ఆయాసం, గుండెలో నొప్పి, గుండె పట్టేసినట్లు ఉండడం, ఒక్కోసారి భోజనం చేసిన తర్వాత కూడా ఇలా జరగొచ్చు. అయితే ముఖ్యంగా ఆడ‌వారిలో గుండెనొప్పి వ‌చ్చేందుకు కార‌ణాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీ సమయంలో హార్మోన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 

 

అదే వారికి షుగర్ ఉంటే.. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉత్పత్తి అయి రక్తనాళాలు గట్టి పడి కుచించుకుపోయి రక్తప్రసరణ తగ్గిపోతుంది. దీంతో.. గుండె నొప్పి రావడం జరుగుతుంది.  విటమిన్ డి, విటమిన్ కె-2 లోపాలు కూడా గుండెనొప్పులు రావడానికి కారణం. కాబట్టి ఈ లోపాలను అధిగమించేందుకు ప్రయత్నించాలి. అధికంగా బరువు పెరగడం కూడా గుండెసమస్యలు రావడానికి కారణం.. స్థూలకాయుల్లో కొలెస్ట్రాల్ పెరిగి రక్తనాళాలు మూసుకుపోతాయి. దీంతో గుండెకి రక్తసరఫరా నిలిచి గుండెసమస్యలు వస్తాయి. అలాగే మెనోపాజ్ సమయంలో ఈస్ట్రోజన్ నిల్వలు తగ్గిపోతాయి. 

 

దీంతో రక్తప్రసరణలో అధికంగా మార్పులు వస్తాయి. ఈ నేప‌థ్యంలోనే గుండె స‌మస్యలు వస్తాయి. మ‌రియు అధిక ఒత్తిడి కార‌ణంగా కూడా గుండెనొప్పి వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. మ‌రి దీని నుంచి ర‌క్ష‌ణ పొందాంలంటే కొన్ని జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి. అయితే నడక గుండెకు మంచిది. అందుకే రోజూ అరగంట పాటు నడవడం అలవాటు చేసుకోండి. కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. కాబట్టి మహిళలూ ఇలాంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదు.. వెంటనే తగిన చికిత్స తీసుకుని గుండెజబ్బులకు రాకుండా ముందుగానే జాగ్ర‌త్త తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: