దంతాలు... మన చిరునవ్వుకు అందాన్ని ఇస్తాయి.. అలాంటి దంతాలను ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందంగా ఉంచుకోడానికి ఎన్నో చిట్కాలు పాటించాలి. అయినప్పటికీ ఆరోగ్య సమస్యల వల్ల.. నీళ్లు మారడం వల్ల మన దంతాలు రంగు మారిపోతాయి. దంతాలు మేరవాలంటే ఎన్నో చిట్కాలు పాటించాలి. 

 

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న దంతాలు రంగు మారటం.. ఆహారపు అలవాట్ల వల్ల దంతాలు పసుపుపచ్చగా మారతాయి. అయితే కొన్ని కొన్ని సార్లు పళ్లు పుచ్చిపోతాయి కూడా వీటికి డాక్టర్ నే కలవాలి. కానీ పసుపు రంగు వచ్చిన దంతాలను తిరిగి తెల్లగా మెరిపించాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. ఆ చిట్కాలు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

బేకింగ్‌ సోడాలో హైడ్రోజెన్‌ పెరాక్సైడ్‌ కలిపి పేస్ట్‌లా చేసి, దాంతో దంతాలు తోమాలి. ఎలా చెయ్యడం వల్ల దంతాలు తెల్లగా మారుతాయి. 

 

భోజనం తర్వాత బేకింక్‌ సోడాలో బ్రష్‌ అద్ది దంతాలు రుద్దుకోవాలి. ఇలా చెయ్యడం వల్ల పళ్లలో ఏదైనా ఉన్న వెళ్లి పళ్ళను జాగ్రత్తగా కాపాడుతుంది. 

 

స్ట్రాబెర్రీలు, నీరు ఎక్కువగా ఉండే పచ్చి కూరగాయలు తింటూ ఉండాలి. వీటివల్ల పళ్లకు కావాల్సిన పోషకాలు అంది పళ్ళు రంగు మారకుండా ఉండేందుకు సహాయ పడుతాయి. 

 

యాపిల్‌ సెడార్‌ వెనిగర్‌లో దూది ముంచి దంతాలు రుద్దుకుని కడిగేసుకోవాలి. ఈ చిట్కా వల్ల దంతాలు ముత్యాలలా మెరిసిపోతాయి. 

 

కొబ్బరినూనె నోట్లో పోసుకుని పుక్కిలించాలి, నిమ్మ తొక్కతో దంతాల మీద రుద్దుకోవాలి. ఈ చిట్కా వల్ల ఆరోగ్యంగా తయారవుతారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: