ఆహారాన్ని అన్నివేళలా సమయానికి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిద‌న్న విష‌యం అంద‌రికీ తెలుసు. కానీ రోజంతా కష్టపడి, బిజీ షెడ్యూళ్ళను అధిగమించి, రాత్రి రుచికరమైన, ఆరోగ్యకరమైన భోజనం తినటం కూడా చాలా అవసరమనే చెప్పాలి. అయితే పొద్దున పూట రాజులా పుష్టిగా తినాలి, మధ్యాహ్నం పూట మంత్రిలా ఆలోచించి తినాలి, రాత్రిపూట బంటులా కొద్దిగా తినాలి అని చెబుతుంటారు. కానీ ఎంత తిన్నం అన్న‌ది ముఖ్యం కాదు.. ఎప్పుడు తిన్నాం అన్న‌ది చాలా ముఖ్యం. నిజానికి  కారణాలు లేకుండా కొన్ని సార్లు రాత్రి భోజనం ఆలస్యంగా చేస్తుంటాం. 

 

ఏదో ఒకటి తినేయడం, ఎక్కువా, తక్కువా తినడం, టైముకి తినకపోవడం, ఆలస్యంగా తినడం, నిద్రపోయే ముందు తినడం ఇలాంటి ఎన్నో పొరపాట్లు చేస్తున్నారు. కానీ ఈ పరిస్థితికి మనం చెక్ పెట్టుకోవాలి. ముఖ్యంగా రాత్రిపూట బాగా ఆలస్యంగా భోజనం చేయడం, తిన్న వెంటనే నిద్రించడం లేదంటే బాగా ఆలస్యంగా నిద్రించడం వల్ల అధికంగా బరువు పెరుగుతారని, టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌. నిజానికి భోజనం తీసుకోవడం ద్వారా మీకు నచ్చినవి లేదా అధిక కేలరీలున్న ఆహారాలను తీసుకోవడం కూడా చేయొచ్చు. 

 

అయితే ఏవీ తీసుకున్నా రాత్రి త్వరగా భోజనం చేయాలి. దీని వల్ల తీసుకొన్న ఆహారం చాలా త్వరగా జీర్ణం అవుతుంది. దాంతో మరుసటి రోజుకు మీకు అవసరం అయ్యే శక్తి కూడా సులభంగా లభిస్తుంది. ఇక డిన్నర్ చేసిన తర్వాత కొద్ది సమయం నడవడం వల్ల అదనపు కేలరీలను కరిగించుకోవచ్చు. దీంతో సులువుగా అధిక బ‌రువుకు చెక్ పెట్ట‌వ‌చ్చు. అలాగే  రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తే.. ఏసీడీటీ, గ్యాస్, అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. త్వరగా తినాలి, తక్కువ తినాలి, మంచి ఆహారం తినాలి... ఇలా చేస్తే ఆహారం చక్కగా జీర్ణం అవుతుంది, నిద్రబాగా పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: