శీతాకాలంలో సాధారణంగా జలుబు, ముక్కుదిబ్బడ ఇబ్బందులకు గురి చేస్తాయన్న విషయం తెలిసిందే. కొందరిలో జలుబు లేకపోయినా ముక్కుదిబ్బడ సమస్యతో బాధ పడుతూ గాలి పీల్చుకోవడానికి ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ కొన్ని చిట్కాలను పాటిస్తే ముక్కుదిబ్బడ సమస్య నుండి సులభంగా బయటపడవచ్చు. కొన్ని వెల్లుల్లి రెబ్బలను తీసుకొని మెత్తని పేస్ట్ లా చేసుకొని గోరు వెచ్చని నీటిలో కలుపుకొని తాగితే ముక్కులో ఉండే శ్లేష్మం వెళ్లిపోయి ముక్కుదిబ్బడ తగ్గుతుంది. 
 
గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి ఆ నీటిని చుక్కల రూపంలో ముక్కు రంధ్రాలలో వేస్తే శ్లేష్మం కరిగి శ్వాస బాగా ఆడుతుంది. ఉల్లిపాయలు ముక్కుదిబ్బడను తగ్గించడంలో సహాయపడతాయి. ఉల్లిపాయలను సగానికి సగం కట్ చేసి వాసన పీల్చడం వలన ముక్కుదిబ్బడ తగ్గుతుంది. గోరు వెచ్చని నీటిని తీసుకొని రెండు టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి రోజుకు 3 పూటలు తాగినా ముక్కుదిబ్బడ నుండి ఉపశమనం లభిస్తుంది. 
 
జలుబు తగ్గాలంటే వేడిపాలలో చిటికెడు పసుపు వేసుకొని తాగటం మంచిది. రెండు కప్పుల నీటిలో దాల్చిన చెక్క, చిన్న అల్లం ముక్క వేసి బాగా మరిగించి ఆ నీటిని వడకట్టి తాగితే జలుబు తగ్గుతుంది. తులసి ఆకులతో టీ చేసుకొని తాగి జలుబు తగ్గించుకోవచ్చు, గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, దాల్చిన చెక్క పొడి, తేనె కలుపుకొని తాగినా జలుబు తగ్గుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: