మాతృత్వం ఆడజన్మకు ఓ వరం. అమ్మతనం కోసం ప్రతి స్ర్తీ తపిస్తుంది. గర్భవతి అని తెలిసిన క్షణం నుంచి పుట్టబోయే బిడ్డను గూర్చి ఎన్నో కలలు కంటుంది. ఇక తొమ్మిది నెలల గర్భధారణ కాలంలో గర్భిణీలు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు అన్నీ ఇన్నీ కావు. తీసుకోవలసిన ఆహారం మీద అవగాహన లేకపోవటం, శారీరక ఇబ్బందులకు పరిష్కారం తెలియకపోవటంతో గర్భిణీలు నవ మాసాల్ని ఎంతో కష్టంతో భరించాల్సిన పరిస్థితి నెలకొంటోంది. అయితే త‌న బిడ్డ ఈ భూమి మీద‌కు రాగానే ఆ న‌వ మాసాల క‌ష్ట‌మంతా ఒక్క క్ష‌ణంలో మ‌ర్చిపోతుంది. ఇదిలా ఉంటే అమ్మ కడుపులో మామూలుగా అయితే 280 రోజులు. లేదా 40 వారాలు. లేదా 9.2 నెలలు ఉంటాం. కానీ కొందరు అంతకు ముందే పుట్టేస్తుంటరు. 

 

అయితే వాతావరణంలో వేడికి, మనం పుట్టే రోజుకు లింకు ఉందంటున్నారు అమెరికా రీసెర్చర్లు. వేడి వాతావరణం వల్ల మనం అమ్మ కడుపులో ఉండే రోజులు తగ్గుతాయని, వాతావరణం కూల్ గా ఉంటే అమ్మ కడుపులో ఎక్కు వ రోజులు చల్లగా ఉంటామని అంటున్నారు. హీట్ వెదర్ వల్ల ముందస్తు కాన్పులు పెరుగుతాయని వీరి రిసెర్చ్‌లో తేలింది. అంతేకాదండోయ్‌.. గ‌ర్భ‌వ‌తులు వేడి వాతావ‌ర‌ణంలో ఉండ‌డం వ‌ల్ల పురిటి నొప్పులకు సహాయ పడే ఆక్సిటోసిన్ హార్మోన్ ముందస్తుగానే,ఎక్కువగా విడుదలవుతుందని తెలిసింది.

 

అలాగే గర్భిణులు హీట్ వెదర్ లో ఉంటే వారికి గుండె సంబంధమైన ఒత్తిడి పెరుగుతుందని రీసెర్చ్‌లో తేలింది. దీంతో మామూలు టైం కన్నా ముందే కాన్పులవుతున్నాయని కనుగొన్నారు. ఈ నేప‌థ్యంలోనే టెంపరేచర్ లు15 నుంచి 21 డిగ్రీ సెంటీగ్రేడ్ల మధ్య ఉన్న రోజుల కన్నా 32 డిగ్రీలకు మించిన రోజుల్లో కాన్పులు ప్రతి లక్ష ప్రసవాల్లో 0.97% పెరిగినట్లు తేలింది. మొత్తంగా ఈ టైం పీరియడ్ లో ఏటా25 వేల ముందస్తు కాన్పులు జరిగాయని అంచనా వేశారు. సో.. పండంటి బిడ్డ కోసం ఆహార జాగ్ర‌త్త‌లే కాదు.. ఇలాంటి జాగ్ర‌త్త‌లు కూడా తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: