పురుషులు ఆరోగ్యంగా ఉంటే సరిపోదు, మ‌గ‌వాడికి ముఖ్యంగా కావ‌ల‌సింది అతని లైంగిక ఆరోగ్యం కూడా బాగుండాలి. ఇలా ఉంటేనే వారి వైవాహిక జీవితం లేదా మరేదైనా సంబంధాలు కొనసాగించడానికి ఉత్తమంగా ఉంటుంది. ఈ ఆధునిక యుగంలో పురుషుల కానీ మరియు స్త్రీలలకు కానీ వారి జీవనశైలి మరియు ఆహారపు అలవాట్ల వల్ల లైంగిక ఆసక్తి తగ్గుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ లైంగిక సమస్యలు ముఖ్యంగా పురుషుల్లో అధికంగా కనబడుతుంటాయి. వారిలో అంగస్తంభన, శ్రీఘ్రస్కలనం, వంధ్యత్వం మరియు మరికొన్ని ఇతర సమస్యలు ఏర్పడుతాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం పురుషుల్లో లైంగిక సమస్యలు కనిపించడం శారీరక లేదా మానసిక సమస్య అని అభిప్రాయం పడుతున్నారు. అయితే ఇటువంటి సమస్యలకు కారణమేంటంటే...

 

శారీరక సమస్యలు కొన్ని శారీరక మరియు వైద్య పరిస్థితులు లైంగిక సమస్యలకు కారణం కావచ్చు. అలాంటి పరిస్థితులేవంటే డయాబెటిస్, గుండె మరియు వాస్కులర్ డిసీజ్, న్యూరోలాజికల్ సమస్యలు, హార్మోన్ అసాధారణతలు, మూత్రపిండాలు లేదా కాలేయ వైఫల్యం మరియు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి. వీటితో పాటు పురుషులు ఎక్కువగా మద్యం లేదా మాదకద్రవ్యాలను ఎక్కువగా సేవించడం. యాంటీ-డిప్రెసెంట్ ఔషధాల వంటి కొన్ని రకాల ఔషధాలు దుష్ప్రభావాలు లైంగిక ఆకాంక్ష మరియు పనితీరు పై ప్రభావితం చేస్తాయి. ఎక్కువ‌శాతం మ‌ద్యం సేవించ‌డం వ‌ల్ల శ‌రీరంలోని అవ‌య‌వాలు బ‌ల‌హీన ప‌డిపోతాయి. దాంతో ర‌క ర‌కాల స‌మ‌స్య‌లు వెల్లువెత్తుతాయి. 

 


నరాల బలహీనత, శీఘ్రస్కలనం: పురుషులలో సంభవించే సాధారణ లైంగిక సమస్యలు నరాల బలహీనత, శీఘ్రస్కలనం, మరియు లైంగిక కోరికలు తగ్గడం. పురుషుల్లో వివిధ రకాల స్ఖలన సమస్యలు కనపడవచ్చు. శీఘ్రస్కలనం స్ఖలనం లైంగిక క్రియకు ముందుగానే లేదా లైంగిక క్రియ ప్రారంభంలోనే స్ఖలనం జరగడం సంభవిస్తుంది. అంగస్తంభన‌ స్ఖలనం చాలా నెమ్మదిగా అవుతుంది. ఈ రకమైన అంగస్తంభనలు గరిష్టంగా ఉన్నప్పుడు స్ఖలనం గర్భాశయంలో కాకుండా మూత్రాశయంలో జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో జరిగే ఇటువంటి శీఘ్రస్ఖలనం లేదా అబ్‌స‌ర్‌స్టికివ్‌ స్ఖలనం వల్ల కొంత మానసిక సమస్యలకు దారిస్తుంది. కొందరిలో లైంగకి క్రియ పట్ల ఆసక్తి లేకపోవడం లేదా మతపరంగా అది ఒక పాపంగా భావించడం లేదా గతంలో ఏవైన లైంగిక సంబంధిత సంఘటనలు కారణంగా భాగస్వామి పట్ల విముఖత చూపుతారు. ఇది కూడా అంగస్తంభన సమస్యకు కారణం కావచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: