ఒళ్ళు నొప్పులు తగ్గాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. వయసు మీద పడే కొద్ది ఒళ్ళు నొప్పులు ఎక్కువ అవుతాయి. ఎముకల బలం తగ్గి నొప్పులు వస్తాయి. అయితే కొన్ని వ్యాయామాలు చెయ్యటం వల్ల శరీరానికి ఎంతో మంచిది. ఒళ్ళు నొప్పుల నుండి వెంటనే తగ్గించుకోవచ్చు. అయితే అది ఎలా అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

క్రంచెస్‌ అనే వ్యాయామం శరీరం మొత్తాన్ని పటిష్ఠం చేస్తుంది. వీపుభాగం, పొట్ట భాగంలోని కండరాలు ఫిట్‌గా మారేలా చేస్తుంది. స్పాండిలోసిస్‌ సమస్య ఉన్నవారు పాక్షిక క్రంచెస్‌ చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

 

హామ్‌స్ట్రింగ్‌ స్ట్రెచెస్‌ అనే వ్యాయామం ఒక్కోసారి వీపుభాగం, కాలి వెనక భాగంలో పట్టేసినట్టు అనిపిస్తుంది. అలాంటి సమయంలో హామ్‌స్ట్రింగ్‌ వ్యాయామం చేస్తే కాస్త ఉపశమనం లభిస్తుంది.

 

పెల్విక్‌ బ్రిడ్జెస్‌ అనే వ్యాయామం వెన్నునొప్పితో బాధపడేవారికి ఈ వ్యాయామాం తొందరగా ఉపశమనాన్ని ఇస్తుంది. వెన్నుముక్కకి ఈ వ్యాయామం సపోర్టుగా ఉంటుంది. 

 

వాల్‌సిట్స్‌ ఈ వ్యాయామం వెన్నులో నొప్పిగా అనిపించినప్పుడు కొన్ని సెకన్ల పాటు వాల్‌సిట్స్‌ చేయాలి. దీంతో నొప్పి వెంటనే తగ్గిపోతుంది. 

 

చూశారుగా.. ఈ చిట్కాలు పాటించి.. ఒళ్ళు నొప్పులకు గుడ్ బై చెప్పండి. ఇంకెందుకు ఆలస్యం న్యూ ఇయర్ రీ సొల్యూషన్ గా మొదలు పెట్టేయండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: