వేడి వేడి వేరు శనగలంటే అందరూ ఇష్టపడుతారు. కాలక్షేపం కోసం చిరు వ్యాపారుల నుంచి కొనుగోలు చేసి తినడం చాలా ఉత్తమం. ప్రధానంగా వంటల్లో వేరుశనగ నూనెను అమితంగా వాడుతారు.  ఇక పేదోడి జీడిపప్పుగా పేరొంది అందరికీ అందుబాటులో ఉన్న వేరుశనగలో పుష్కలమైన పోషకాలు ఉన్నాయి. వేరు శనగల్లో ఎక్కువగా ఉండే విటమిన్ ఇ, సిలీనియం, ఫైబర్, జింక్ శరీర సౌందర్యానికి కావలసిన హార్మోన్ల ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడతాయి.

 

రక్త ప్రసరణను మెరుగు చేసి మంచి ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యానికి ఉపకరిస్తాయి. విభిన్నమైన రుచి కలిగి ఉండే.. వేరుశనగ గింజలను సౌత్ ఇండియన్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే చాలా మంది వేరుశ‌న‌గ‌లు తొక్క తీసేసి తింటారు. కానీ ప‌ల్లీలను తొక్క‌ల‌తో తింటేనే చాలా మంచిది. అలాగే వేరుశనగ గింజల తొక్కల్లో ఆరోగ్యాన్ని పెంచే, రోజువారీ అవసరమయ్యే చాలా పోషకాలున్నాయి. వేరుశనగ తొక్కల్లో కూడా గుండె జబ్బులు, కాన్సర్, హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకునే గుణాలున్నాయి.

 

విటమిన్ సీ, గ్రీన్ టీ కంటే వేపిన వేరు శనగ గింజలకు ఉండే తొక్కల్లో యాంటీఆక్సిడెంట్ కంటెంట్ ఎక్కువగా ఉంది. పీనట్ స్కిన్‌లో ఉండే ఫైబర్... శరీర అధిక బరువును తగ్గిస్తోంది. చిత్రమేంటంటే మామూలు వేరు శనగ గింజల కంటే వేపిన వేరుశనగ గింజల తొక్కలకు ఎక్కువ విష వ్యర్థాల్ని అడ్డుకునే శక్తి ఉన్నట్లు 2012లో జరిపిన పరిశోధనల్లో తేలింది. అదే విధంగా.. వీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది. సోడియం తక్కువగా ఉంటుంది. కాబట్టి బీపీ ఉన్నవారికి ఇవి ఉపయోగపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: