బీపీ.. ఇప్పుడు ఇది వాడుక పదం. చిన్న పిల్లల నుండి వృద్ధుల వరుకు ప్రతి ఒక్కరు బీపీ.. బీపీ.. తెప్పియకు అని డైలాగ్ వేస్తారు. కానీ ఈ బీపీ చాలా డేంజర్ అని చాలామందికి తెలియదు. అయితే ఈ బీపీ వల్ల ఒక్కో సారి గుండెపోటు కూడా వస్తుంది. ఈ బీపీ ఎక్కువగా టెన్షన్ పడటం వల్ల.. ఎక్కువగా ఉప్పు, కారం వంటివి తీసుకోవటం వల్ల వస్తుంది. 

 

అయితే అధిక బీపీ వల్ల గుండె కవాటాల్లో లోపాలు ఎక్కువగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ఆక్స్‌ఫర్డ్‌ పరిశోధనలో తేలింది. చిన్న వయసులో అధిక రక్తపోటు లక్షణాలు కనిపిస్తే గుండె నుంచి శరీరభాగాలకు రక్త సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతాయి అని.. దీనివల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని వెల్లడైంది. 

 

ముఖ్యంగా గుండెలోని మిట్రల్‌ కవాటాలకు సమస్యలు తలెత్తుతాయని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ కాజిమ్‌ రహిమి వెల్లడించారు. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, త్వరగా అలసిపోవటం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయని చెప్పారు. అయితే అలాంటి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.. లేదు అంటే ఇబ్బందులు పడక తప్పదు. 
  

 

మరింత సమాచారం తెలుసుకోండి: