చలి చక్కిలిగింతలు పెడుతుంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి? దాదాపుగా అందరికీ చలికాలం అంటే పిచ్చ పిచ్చగా నచ్చేస్తుంది. తెల్లవారుజామున కురిసే మంచు చూడాలని కొందరు ఆసక్తి చూపిస్తారు.  ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. మున్ముందు పొగముంచు దుప్పటిలా కప్పేయనుంది. అలాగే చలికాలం వచ్చిందంటే స్వెటర్లు, మఫ్లర్లు తదితర ఉన్ని దుస్తులతో క‌ప్పేసుకుంటారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చలి - పులి తన ప్రతాపాన్ని చూపక మానదు. ఈ నేపథ్యంలోనే మరింత వెచ్చదనం కావాలని కోరుకునే వారు ఈ కాలంలో నిత్యం తీసుకునే తమ ఆహారంలో స్వల్ప మార్పులు చేసుకుంటే శరీరానికి ఇంకొంత వెచ్చదనాన్ని అందించవచ్చు.

 

అలాగే ఈ సీజ‌న్‌లో వ‌చ్చే ప‌లు వ్యాధులు కూడా న‌య‌మ‌వుతాయి. ఈ క్రమంలో మ‌నం చ‌లికాలంలో ఏయే ఆహార ప‌దార్థాల‌ను తినాలో ఇప్పుడు చూద్దాం. దానిమ్మ పండు.. చ‌లి కాలంలో వ‌చ్చే శ్వాస‌కోశ వ్యాధుల నుంచి దానిమ్మ మ‌న‌కు ర‌క్ష‌ణ‌నిస్తుంది. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. ఎర్ర ర‌క్త క‌ణాలు ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అయ్యేలా చేస్తుంది. వెల్లుల్లి.. శరీర ఉష్ణోగ్రతను పెంచే గుణాలు వెల్లుల్లిలో ఉన్నాయి. చలికాలంలో ఎక్కువగా ఇబ్బందులు పెట్టే ఫ్లూ, దగ్గు, జలుబు వంటి వాటి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.  దీంతోపాటు వెల్లుల్లిని తరచూ తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె జబ్బులను రాకుండా అడ్డుకుంటుంది. 

 

నువ్వులు.. చేసిన ఆహార ప‌దార్థాల‌ను తీసుకుంటే శ‌రీరంలో వేడి పెరిగి చ‌లికాలంలో శరీర ఉష్ణోగ్ర‌త ఒకే లెవ‌ల్‌లో ఉంటుంది. ఇలా ఉండ‌డం మన‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది. నట్స్.. మనకు మార్కెట్‌లో అనేక రకాల నట్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో వాల్‌నట్స్, బాదంపప్పు, వేరుశనగలను నిత్యం తింటే శరీరానికి కావల్సినంత వేడి ఉత్పత్తి అవుతుంది. పాల‌కూర.. ఆకుప‌చ్చ రంగులో చూడ‌గానే తిన‌బుద్ది అయ్యేలా ఉండే పాల‌కూర‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి ఈ కాలంలో మ‌న‌కు సంక్ర‌మించే వ్యాధుల నుంచి కాపాడ‌తాయి.


 

 

మరింత సమాచారం తెలుసుకోండి: