మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. మన శరీరానికి కావాల్సినన్ని విటమిన్లు ఉండాలి. అయితే మనం తీసుకునే ఆహారం వల్ల కొన్ని కొన్ని విటమిన్లు లోపిస్తాయ్. అయితే ఎలాంటి లక్షణాలు ఎలాంటి విటమిన్లకు లోపం అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

రోజంతా నీరసంగా ఉంటోందంటే దానికి విటమిన్‌ బి12 లోపమే కారణం అని తెలుసుకోవాలి. పోషకాహార లోపం లేదా తగినన్ని ఎర్ర రక్తకణాలను తయారుచేయలేని శారీరక లోపం ఉంటే విటమిన్‌ బి12 లోపం తలెత్తుతుంది అని పసిగట్టాలి. బి12 లోపమే క్రమంగా రక్తహీనతకు దారి తీస్తుంది. ఈ లోపం తగ్గాలంటే కొన్ని చిట్కాలు తప్పక వాడాలి. 

 

బి12 లోపానికి కారణాలు ఇవే..  

 

జీర్ణాశయంలో తయారయ్యే యాసిడ్‌ను నియంత్రించే మందులు వాడటం, అట్రోపిక్‌ గ్యాస్ట్రయిటిస్‌, ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్స్‌ వంటివి బి12 లోపానికి కారణం అవుతాయి. 

 

బి12 లక్షణాలు ఇవే... 

 

జ్ఞాపకశక్తి తగ్గటం, కండరాల బలహీనత, నొప్పులు, నీరసం, బలహీనత, గుండె వేగంగా కొట్టుకోవటం, పాలిపోయిన చర్మం, ఆకలి లేకపోవటం, డిప్రెషన్‌, బరువు తగ్గటం, చేతులు, అరికాళ్లలో తిమ్మిర్లు వంటివి ఎక్కువగా వస్తాయి. ఇవే బి12 లోపానికి లక్షణాలు. 

 

బి12 లోపం పోవాలంటే ఇవి తినాలి... 

 

చేపలు, మాంసం, గుడ్లు, సోయా, గ్రెయిన్స్‌, డెయిరీ ప్రొడక్ట్స్‌ ఎక్కువగా తీసుకుంటే బి12 లోపం పూర్తిగా తగ్గుతుంది. బి12 లోపం ఉన్నవారు ఇవి తప్పకుండా తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: