సాధార‌ణంగా టమాటాతో చేసే వంటకాన్ని ఇష్టపడని వాళ్ళు ఉండరు. ఎలాంటి వంటకమైన టమాట వేస్తే చాలు.. అద‌న‌పు రుచి వచ్చేస్తుంది. అయితే కేవలం రుచికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందిట ఈ టమాట. అయితే టమోటాను వంటల్లో కాకుండా జ్యుస్ రూపంలో కూడా చేసుకొని తాగుతారు కొంద‌రు. ఇక వీటిల్లో కాన్సర్‌ను అడ్డుకునే గుణాలున్నాయి. వాటిలో ఉండే లైకోపీన్... కొలన్, ప్రొస్టేట్, లంగ్ కాన్సర్లను అడ్డుకుంటోంది. టమాటా లలో క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ సిలు ఎక్కువ మోతాదులో ఉంటాయట.

 

ఎసిడిటీతో బాధపడేవారు టమాటాలతో తయారు చేసిన వంటకాన్ని రుచి చూస్తే ఎంతో ఉపశమనం కలుగుతుంది. అలాగే బీపీని తగ్గించే లక్షణాలు టమాటాల్లో పుష్క‌లంగా ఉన్నాయి. డయాబెటిస్, హైపర్ టెన్షన్, గుండె సమస్యలు ఉండేవారు కూడా టమాటాలు తింటే మంచిది. ట‌మాటాల‌ను నిత్యం ఆహారంలో తీసుకుంటే.. లివ‌ర్ క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయ‌ని, లివ‌ర్ ఆరోగ్యం మెరుగు ప‌డుతుంద‌ని ఓ ఆధ్యాయ‌నంలో కూడా తేలింది. మ‌రియు మతిమరపు, డిప్రెషన్, టెన్షన్ వంటివి కలిగి ఉండేవారు టమాటాలు తినాలి.

 

వాటిలోని బి, ఇ విటమిన్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఇక చర్మం కోమలంగా, య‌వ్వ‌నంగా ఉండాలంటే టమాటాలు తినాల్పిందే. ఎందుకంటే వాటిలోని బయోటిన్, విటమిన్ సీ ప్రోటీన్ల ఉత్పత్తిని క్రమబద్ధీకరిస్తాయి. చర్మ కణాల్ని రిపేర్ చేసి.. ముసలితనం రాకుండా ర‌క్షిస్తాయి. అలాగే టమోటాలో సమృద్ధిగా ఉండే ఫైటో న్యూట్రియంట్లు రక్తం గడ్డకట్టకుండా కాపాడతాయి. దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. మ‌రియు ప్రెగ్నెన్సీ సమయంలో ఎన్ని టమాటాలు తింటే అంత మంచిది. పుట్టే పిల్లలు అత్యంత ఆరోగ్యంగా, ఎలాంటి సమస్యలూ లేకుండా పుడతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: