సాధారణంగా వచ్చే శారీరక సమస్యలలో తలనొప్పి కూడా ఒకటి. సరిపడా మంచినీళ్లు తాగకపోవడం, ఎక్కువ సమయం కంప్యూటర్ స్క్రీన్ చూడటం, పని ఒత్తిడి, నిద్రలేమి, ఇతర కారణాల వలన తలనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తలనొప్పి రాగానే చాలామంది టాబ్లెట్స్ వేసుకుంటారు. కానీ కొన్నిసార్లు టాబ్లెట్ వేసుకుంటే తలనొప్పి తగ్గినా మరలా తలనొప్పి వస్తూ ఉంటుంది. కొన్ని చిట్కాలను పాటిస్తే తలనొప్పి సమస్య నుండి సులభంగా బయటపడవచ్చు. 
 
గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకుని ప్రతిరోజు తాగితే క్రమక్రమంగా తలనొప్పి తగ్గుతుంది. యూకలిఫ్టస్ ఆయిన్ ను తలపై, నుదుటిపై మసాజ్ చేసుకుంటే కూడా తలనొప్పి తగ్గుతుంది. భోజనంలో నెయ్యిని చేర్చడం ద్వారా గోరువెచ్చని ఆవు పాలను తాగడం ద్వారా కూడా తలనొప్పి తగ్గుతుంది. గంధాన్ని పేస్ట్ లా చేసుకొని నుదుటిపై రాసుకొని కొంత సమయం విశ్రాంతి తీసుకుంటే కూడా తలనొప్పి తగ్గుతుంది. 
 
తలనొప్పితో పాటు జలుబు కూడా ఉంటే ధనియాలు, చక్కెర కలిపిన నీళ్లు తాగితే మంచిది. పడుకునే ముందు 15 నిమిషాల పాటు పాదాలను వేడి నీటి బకెట్ లో ఉంచితే తలనొప్పితో పాటు సైనస్ తలనొప్పి కూడా తగ్గిపోతుంది. ఆల్కహాల్ అలవాటు ఉన్నవారికి తలనొప్పి వస్తే ఆల్కహాల్ కు వీలైనంత దూరంగా ఉండంటం మంచిది. బ్రేక్ ఫాస్ట్ చేయడం మానేస్తే కూడా తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. అందువలన బ్రేక్ ఫాస్ట్ ఎట్టి పరిస్థితులలోను మానేయకూడడు. కంప్యూటర్ల ఎదుట ఎక్కువగా పని చేసే వారు మధ్యమధ్యలో కొంత సమయం బ్రేక్ తీసుకుంటే తలనొప్పి సమస్య నుండి బయటపడే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: